పంతం నెగ్గించుకున్న వైసీపీ ఎమ్మెల్యే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-24 03:25:42

పంతం నెగ్గించుకున్న వైసీపీ ఎమ్మెల్యే

ప్ర‌జ‌ల ప‌క్షాన ఎటువంటి ఆప‌ద వ‌చ్చినా ఉంటున్నారు వైసీపీ నాయ‌కులు.. తాజాగా ఇదే పందాలో మ‌రో వైసీపీ ఎమ్మెల్యే త‌న పందాచూపించారు.. అనంత‌పురం జిల్లాలో ఉర‌వ‌కొండ ప‌ట్ట‌ణంలోని అర్హులైన పేద‌ల‌కు ఉండ‌టానికి కాస్త జాగా ఇప్పించేందుకు కంక‌ణం క‌ట్టుకున్నారు  ఉర‌వ‌కొండ వైసీపీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వ‌ర‌రెడ్డి.
 
టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి  ఆయ‌న దశలవారిగా  ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. చివరికి వైఎస్సార్‌సీపీ అధినేత, ప్రతి పక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డినే, స్వయంగా ఉరవకొండ తీసుకొచ్చి ఇంటి పట్టాల కోసం ధర్నా చేయించి ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా చేశారు విశ్వేశ్వ‌రరెడ్డి.. ఈ విష‌యం అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది.. దీంతో అధికార పార్టీ కూడా డైల‌మాలో ప‌డింది ఆ స‌మ‌యంలో....  ఇక ఇదే స‌మ‌యంలో ప్ర‌జల ప‌క్షాన పేద‌ల ప‌క్షాన నిలుస్తూ ఆయ‌న మూడు నెల‌ల క్రితం న్యాయ‌స్ధానాన్ని ఆశ్ర‌యించారు.
 
దీంతో  అర్హులైన వారికి ఇంటిపట్టాలు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని, హైకోర్టు జిల్లా ఉన్నతాధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. అంతే కాకుండా కోర్టులో  పిల్‌  దాఖలు చేయాలని కూడా సూచించింది. కోర్డు ఆదేశాలు ఇవ్వ‌డంతో జిల్లా అధికారులు ప‌నులు ముందుకు తీసుకువ‌చ్చారు.. పేద‌ల‌కు ఇంటిప‌ట్టాలు ఇచ్చేప్ర‌క్రియ‌ను ప్రారంభించారు.. 
 
!! అస‌లు వివ‌రాల్లోకి వెళ్తే!!
 
2008 లో అప్ప‌టి సీఎం వైయ‌స్  రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌భుత్వ హయాంలో ఉర‌వ‌కొండ ప‌ట్ట‌ణంలో నిరుపేద‌ల‌కు ఇంటిప‌ట్టాలు ఇవ్వ‌డానికి, ఆ నాడు 88 ఎక‌రాల స్ధలాన్ని కోటి రూపాయ‌లు చెల్లించి కొనుగోలు చేసింది స‌ర్కార్.. ఇక నిరుపేద‌ల‌కు అంద‌రికి ప‌ట్టాలు పంచి పెట్ట‌డానికి మాత్రం తర్వాత అధికారంలోకి వ‌చ్చిన  టీడీపీ స‌ర్కారు కాల‌యాప‌న చేస్తోంది. దీంతో రంగంలోకి దిగిన ఎమ్మెల్యే విశ్వేశ్వ‌ర‌రెడ్డి అధికారుల‌పై ఒత్తిడి తీసుకువ‌చ్చారు..చివ‌ర‌కు అక్క‌డ ప్ర‌జ‌లు ఎమ్మెల్యే చొర‌వ‌తో మాకు న్యాయం జ‌రిగింది అని ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.