ఏపీపై మోదీ కీల‌క నిర్ణ‌యం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-26 12:24:26

ఏపీపై మోదీ కీల‌క నిర్ణ‌యం

తెలంగాణ లో టీఆర్ ఎస్ పార్టీ సొంతంగా ఎన్నిక‌ల్లో నిల‌బ‌డ‌టానికి వ‌చ్చేది జ‌మిలి అయినా సార్వ‌త్రిక ఎన్నిక అయినా పర్వాలేదు అనే రీతిన ఉంది.. ఇటు ఏపీలో తెలుగుదేశం పార్టీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కు బీజేపీ మ‌ద్ద‌తు ఇస్తుందా లేదా అనే డైల‌మాలో ఉంది.. అలాగే వైసీపీ మాత్రం గ‌త ఎన్నిక‌ల స‌ర‌ళిని బేరీజు వేసుకుని, ముందుకు వెళుతోంది.. పార్టీకి ప్ర‌యారిటీ కాకుండా ఏపీకి ప్ర‌యారిటీ ఇస్తూ ప్ర‌జ‌ల‌కు ప్ర‌జాయోజిత‌మైన నిర్ణ‌యం ద్వారా రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇచ్చే వారితో క‌లిసి వ‌చ్చేందుకు రెడీ అని బీజేపీకి కాస్త హింట్ గా ఇచ్చారు.. అయితే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌పై కాస్త కాన్స‌న్ట్రేష‌న్ పెంచింది కేంద్రం.

కాస్త ఎదిగే అవ‌కాశం ఉన్నఏపీ - తెలంగాణ‌లో స్వ‌యంకృపారాధాన్ని త‌గ్గించుకోవాలి అని చూస్తోంది బీజేపీ.. అదే రీతిన ఆలోచ‌న‌లు పార్టీ వ్య‌వ‌హారాలు కార్య‌క్రమాలు నిబ‌ద్ద‌త క‌లిగిన నాయ‌కుల‌కు అప్ప‌గించాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నారు క‌మ‌లం పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు.

తాజాగా లోక్ స‌భ‌తోపాటు అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను క‌లిపి జ‌రిపే అవ‌కాశం ఉన్న రాష్ట్రాలెన్నీ, అక్క‌డ ప‌రిస్థితులు ఎలా ఉంటాయ‌నే అంశంపై అధ్య‌య‌నం చేయాల్సిందిగా మోదీ క‌మ‌లం పార్టీ నాయ‌కుల‌కు వ్యూహాక‌ర్త‌ల‌కు ఇటీవ‌ల తెలియ‌చేశార‌ట‌.

దీనిపై ఇప్ప‌టికే ఏపీలో తెలంగాణ‌లో రాజ‌కీయ లెక్క‌లు స్టార్ట్ అయ్యాయ‌ని తెలుస్తోంది... అలాగే ఒకేసారి ఎన్నిక‌ల సాధ్యాసాధ్యాల‌ను కూడా ప‌రిశీలిస్తున్నారు ఇటు ప్ర‌ధాని మోదీ. ఏప్రియ‌ల్ నెల‌లో క‌ర్నాట‌క లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతాయి, ఆ స‌మ‌యంలో అక్క‌డ ఫ‌లితాల‌పై కూడా బీజేపీ ఏపీ తెలంగాణ పై నిర్ణ‌యం తీసుకుంటుంది అంటున్నారు.... ఇటు వైసీపీ కూడా బీజేపీకి దగ్గ‌ర అవుతోంది. మ‌రోప‌క్క తెలుగుదేశం ఈ ప‌రిణామాన్ని జీర్ణించుకోలేక‌పోతోంది...అయితే ఏపీలో ప‌రిస్దితుల‌పై మోదీ కోట‌రీలో కీల‌క నాయ‌కుడికి ఇక్క‌డ బాధ్య‌త‌లు అప్ప‌గించారు అని తెలుస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.