మైత్రి కోసం మోదీ వేసిన బాట ఇదేనా..

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-25 03:03:47

మైత్రి కోసం మోదీ వేసిన బాట ఇదేనా..

ద‌క్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల ప్ర‌భావంతో జాతీయ పార్టీలు ఉనికిని కొన‌సాగించ‌డం కాస్త క‌ష్టంగానే  ఉంది. అయినా స‌రే కేంద్రంలో  జాతీయ పార్టీల హ‌వా ఉంటుంది కావున... అవ‌కాశాల‌ను ఆస‌రాగా చేసుకుంటూ  ప్రాంతీయ పార్టీల‌తో పొత్తులు పెట్టుకుని రాజ‌కీయ క్రీడ‌ను కొన‌సాగిస్తున్నారు.
 
ఈ క్ర‌మంలో  ఎప్పుడు... ఏ పార్టీ... ఎవ‌రితో..... పొత్తు పెట్టుకోనుంది.... ఎవ‌రితో తెగ‌దెంపులు చేసుకుంటున్నార‌నే  దానిపై  ఎన్నిక‌ల ముందు ఆస‌క్తి కొన‌సాగుతూనే ఉంటుంది.  తాజాగా మ‌హారాష్ట్ర‌లో శివ‌సేన-భాజాపాల మైత్రికి బ్రేక్ ప‌డింది. మ‌రోవైపు ఎర్ర‌సైన్యం (సీపిఐ-సీపిఎం) వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీతో క‌లిసి ముందుకు సాగే దిశ‌గా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. 
 
ఇక ఏపీలో కూడా భార‌తీయ జ‌న‌తా పార్టీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుంద‌నే దానిపై ఇప్పుడు ఉత్కంఠ కొన‌సాగుతోంది. ఒకవేళ హోదా ఇస్తామంటే బీజేపీకి మ‌ద్ద‌తు ఇస్తామ‌ని ఇటీవ‌ల వైయ‌స్ జ‌గ‌న్  మోహ‌న్ రెడ్డి చేసిన ప్ర‌క‌ట‌న అంద‌రికీ తెలిసిందే. 
 
దీంతో ఒక్క సారిగా  ఏపీ రాజ‌కీయాలు ఉత్కంఠ‌గా మారాయి. ఓ వైపు టీడీపీ-బీజేపీ క‌లిసి ఉన్నా కూడా స‌వ‌తుల్లా కొట్టుకుంటున్నార‌నే అప‌వాద మూట‌గ‌ట్టుకున్నాయి. విభ‌జ‌నచ‌ట్టంలో పేర్కొన్న అంశాల‌పై అవ‌స‌ర‌మైతే కోర్టుకు వెళ్తా అంటూ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు  ఇటీవ‌ల చేసిన  ప్ర‌క‌ట‌నతో ఈ రెండు పార్టీల మ‌ధ్య వివాదం మ‌రింత  తారా స్ధాయికి చేరింద‌నే చెప్పాలి.  బాబు కోర్లుకు వెళ్తే మేము కోర్టుకు వెళ్తామంటూ సోము వీర్రాజు కౌంట‌ర్ కూడా వేశారు. 
 
దీంతో  ఏపీ  బీజేపీ భ‌విష్య‌త్తును దృష్టిలో ఉంచుకుని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో క‌లిసి ముందుకు సాగే దిశ‌గా  చ‌ర్చ‌లు సాగుతున్నాయ‌ని స‌మాచారం. ఇందులో భాగంగానే హోదా నినాదాన్ని మ‌రోసారి పెద్ద ఎత్తున‌ తెర‌పైకి తీసుకువ‌చ్చార‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. 
 
ఇక హోదాను ఇవ్వ‌లేమ‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ప్ర‌క‌ట‌న చేయ‌డంతో పాటు ప్యాకేజీ ప్ర‌క‌టించింది. మ‌రో ఆసక్తిక‌ర‌మైన విష‌యం ఏంటంటే ....హోదా అడిగిన త‌ర్వాత చూద్దాం అంటూ  ఇటీవ‌ల ఏపీకి వ‌చ్చిన నీతి అయోగ్ వైస్ చైర్మ‌న్  రాజీవ్ కుమార్ చేసిన  ప‌లు వ్యాఖ్య‌లు అనేక అనుమానాల‌కు తెర‌లేపింది. 
 
చంద్ర‌బాబు స‌ర్కార్ కేంద్రాన్ని ఇంత‌వ‌ర‌కు హోదా ప్ర‌తిపాద‌న చేయ‌లేదా...? ఒక‌వేళ చేసినా కావాల‌నే ఆయ‌న ఇలాంటి ప్ర‌క‌ట‌న చేశారా.......? రాజీవ్ కుమార్ ద్వారా మోదీ ఏపీపై హోదా అస్త్రం వ‌దిలారా....? జ‌గ‌న్ తో మైత్రి కోస‌మే మోదీ  దారి వేసారా....? ఒక‌వేళ హోదాకు బీజేపీ సానుకూలంగా స్పందిస్తే టీడీపీ ప‌రిస్థితి ఏంటి.......? అనే ప్ర‌శ్న‌లు   ఉద్భ‌వించాయి...?  వీట‌న్నింటికి స‌మాధానం దొర‌కాలంటే మ‌రి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.