వైసీపీ టీడీపీ రెడీ మోదీ గ్రీన్ సిగ్న‌ల్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-24 04:13:24

వైసీపీ టీడీపీ రెడీ మోదీ గ్రీన్ సిగ్న‌ల్

ఈ ఏడాది ఎన్నిక‌లు అంటే అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు.. అవును మోదీ ఆలోచ‌న అలానే ఉంది... సార్వ‌త్రిక ఎన్నిక‌ల షెడ్యూల్ ప్ర‌కారం 2019 ప్ర‌ధ‌మార్ధంలో ఎన్నిక‌లు జ‌ర‌గాలి.. కాని దేశంలో ఒకేసారి ఎన్నిక‌లు అనే కొత్త ప్లాన్ కు ప్ర‌ధాని మోదీ రెడీ అవుతున్నారు. అయితే తాజాగా ప‌లు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల ఫ‌లితాలు బీజేపీకి అనుకూలంగా రావ‌డం, బీజేపీ హవా దేశంలో పెర‌గ‌డంతో, మోదీ దీనిపై ముందు అడుగు వేస్తున్నారు అని తెలుస్తోంది. ఇది బీజేపీ వ‌ర్గాలే తెలియ‌చేస్తున్నాయి.
 
ఇక తాజాగా సౌత్ లో క‌ర్ణాట‌కాలో కూడా ఇదే చ‌ర్చ జరుగుతోంది.. ఇక తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ-  ఏపీలో కూడా రాజ‌కీయ పార్టీలు కాస్త ఆలోచ‌న‌లో ప‌డ్డాయి.. బీజేపీ  తెలుగుదేశం మిత్ర‌ప‌క్షం అయినా కేవ‌లం మోదీ రూలింగ్ లో మాత్ర‌మే వాటా ఇచ్చారు... కాని స‌ల‌హాలు నిర్ణ‌యాలు చెప్ప‌డంలో పాలు పంచుకోవ‌డం లేదు అని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.
 
ఇటు తెలంగాణ‌లో కాంగ్రెస్, అలాగే  అధికార పార్టీ టీఆర్ ఎస్... ఈ ఏడాది ఎన్నిక‌లు రానున్నాయి అని రెడీ అవుతున్నాయి... మ‌రో ప‌క్క ఏపీలో ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ పాద‌యాత్ర‌తో ప్ర‌జాక్షేత్రంలో ఉన్నారు.. ఇటు తెలుగుదేశం కూడా ఎటువంటి యాత్ర‌లు చేయాలా అని ఆలోచిస్తోంది..మొత్తానికి హస్తిన‌లో మాత్రం జమిలి ఎన్నిక‌ల‌కు మోదీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని తెలుస్తోంది.. ఈసీ కూడా స‌మాయ‌త్త‌మ‌ని ఇప్ప‌టికే తెలుపుతోంది.. దీంతో జ‌మిలి ఎన్నిక‌లు ఖాయంగా ఈ ఏడాది తెలుస్తోంది.. ఇక ఏపీలో తెలుగుదేశం వైసీపీ, అటు తెలంగాణ‌లో టీఆర్ ఎస్ - కాంగ్రెస్ పార్టీలు జ‌మిలి కోసం ఇప్ప‌టి నుంచే రాజ‌కీయ వ్యూహాల‌కు ప‌దునుపెడుతున్నాయి.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.