మోదీ మార్క్ బాబు షేక్ టీడీపీ లెఫ్ట్ ట‌ర్న్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-01 03:23:09

మోదీ మార్క్ బాబు షేక్ టీడీపీ లెఫ్ట్ ట‌ర్న్

మొత్తానికి కేంద్ర బ‌డ్జెట్ ను ప్ర‌వేశ‌పెట్టింది మోదీ స‌ర్కార్.. అయితే అరుణ్ జైట్లీ దేశీయ బ‌డ్జెట్ ను ప్ర‌వేశ‌పెట్టి సెంట్ర‌ల్ లెవెల్ లో ప్ర‌జ‌ల‌ను కాస్త ఊరించేవిధంగా  ప‌థ‌కాలు కొత్త ఆవిష్క‌ర‌ణ‌లు విధానాలు తెలియ‌చేశారు.. అలాగే నూత‌న విధానాల‌తో  దేశాన్ని ముందుకు తీసుకువెళుతున్నాం అని బ‌డ్జెట్ లో వివ‌రించారు.
 
ఇక రాష్ట్రాల‌లో బ‌డ్జెట్ లు రెడీ అవుతున్నాయి.. కాని ఏపీ, తెలంగాణ‌లో దేశీయ బ‌డ్జెట్ పై ఆనందం వ్య‌క్త ప‌రిచినా రాష్ట్రానికి ఈ ఏడాది ఎటువంటి ప్ర‌యోజిత ప‌థ‌కాలు ప‌నులు ప్ర‌వేశ‌పెట్ట‌లేద‌ని వాపోతున్నారు.. రైల్వే బ‌డ్జెట్ కూడా అనుకున్నంత ఆశాజ‌న‌కంగా లేదు.. దీంతో ఏపీకి ఎటువంటి ప్ర‌యోజనాలు రైల్వే ప్రాజెక్టులు జోన్ లు ఏమీ తెలియ‌చేయ‌లేదు.. అయితే ముందుగా వైసీపీ దీనిపై స్పందించింది...  కేంద్రం ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ పై ఏపీకి ఎటువంటి ప్ర‌యోజ‌నాల క‌లిపించేలా లేద‌ని అన్నారు.. అయితే ఇటు తెలుగుదేశం నాయ‌కుల మాత్రం సైలెంట్ గానే ఉన్నారు. దేశీయంగా బడ్జెట్ పై హ‌ర్షం వ్య‌క్తంచేశారు వైసీపీ నాయ‌కులు, అయితే మా రాజీనామాల గురించి అడుగుతున్న తెలుగుదేశం దీనిపై ఎటువంటి స‌మాధానం చెబుతుంది అని ప్ర‌శ్నిస్తున్నారు.
 
అయితే ఎటువంటి ఫ‌లాలు ఏపీకి ఇచ్చినా ఆ క్రెడిట్ బాబుకు ద‌క్కుతుంది... ఈ పాయింట్ ను బాగా గ్ర‌హించింది బీజేపీ..... అందుకే పోల‌వ‌రం నుంచి అన్ని వ‌రాలు కేంద్రం సెంట‌ర్ అయ్యేలా నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు.. ఇప్పుడు తెలుగుదేశం దీనిపై వెన‌క‌డుగువేసి త‌మ ఎంపీల చేత రాజీనామాలు చేయించినా కేంద్రం నుంచి ఎటువంటి ప్ర‌తిఫ‌లం పొంద‌లేరు, ఒక‌వేళ అల‌యెన్స్ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తే ఓటుకు నోటు కూడా వారిపై ప్రెజ‌ర్ ఉంటుంది అని తెలుగు త‌మ్ముళ్లు భ‌య‌ప‌డుతున్నారు. మ‌రి చూడాలి దీనిపై ఎటువంటి స‌మాధానం తెలుగుదేశం నుంచి వ‌స్తుందో.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.