జ‌గ‌న్ కు మోదీ ఆఫ‌ర్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-24 10:59:28

జ‌గ‌న్ కు మోదీ ఆఫ‌ర్

2014 ఎన్నిక‌లు జ‌రిగిపోయాయి, అప్పుడు పొత్తులు పెట్టుకున్న పార్టీలు ఇప్పుడు వేరే కుంప‌టి పెట్టేలా క‌నిపిస్తున్నాయి.. అయితే ఎన్నిక‌ల‌కు ఇంకా చాలా స‌మ‌యం ఉండ‌టంతో, ఇటు కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న టీడీపీ ఆచితూచి రాజ‌కీయంగా స్టెప్స్ వేస్తున్నాయి.. అస‌లు గ‌త  ఎన్నిక‌ల స‌మ‌యంలో మోదీకి చంద్రబాబు అవ‌స‌రం లేదు, జ‌స్ట్ సీట్ల లెక్క ఎంపీల సంఖ్య పెర‌గాలి అదే స్ట్రాట‌జీ కోసం, త‌మ‌తో క‌లిసి వ‌చ్చే వారిని ద‌గ్గ‌ర‌కు చేర్చుకున్నారు మోదీ.. అయితే ఇటు తెలుగుదేశం తీసుకున్న ఆ ఆఫ‌ర్, జ‌గ‌న్ ముందు తిర‌స్క‌రించారు అనేది, ప‌లువురు ఇప్పుడు రివీల్ చేస్తున్నారు.
 
ఇక తిలా పాపం త‌లా పిడెక‌డు అని ఇటు తెలుగుదేశం చేసే కార్యాల‌కు, అమ‌లు చేసే  ప‌థ‌కాల పై వ‌చ్చే విమ‌ర్శ‌ల‌కు బీజేపీ కూడా అప‌వాదులు ఎదుర్కోవ‌ల‌సి వ‌స్తోంది.. అందుకే ఏపీ క‌మ‌ల‌నాథులు అన‌వ‌స‌రంగా తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నాము అనే విధంగా కామెంట్లు చేస్తున్నారు... సో ఇక్క‌డికి రాజ‌కీయంగా ప్ర‌స్తుత ప‌రిస్దితి ఇలా ఉన్నా,  ఏపీలో జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిణామాలు అన్ని  కేంద్రం నిశితంగా ప‌రిశీలిస్తోంది... మ‌రీ ముఖ్యంగా కాషాయం పార్టీ త‌ర‌పున నాయ‌కులు ఏపీలో ప‌రిపాల‌న పై నిశిత ప‌రిశీల‌న చేస్తున్నారు.
 
ఏపీ తెలుగుదేశం నాయ‌కుల విధానాలు, వారు చేసే ప‌నులు కాంట్రాక్టులు అన్నింటి పై కేంద్రం నిఘా వేస్తోంది.. అలాగే తెలుగుదేశం కేబినెట్లో  క‌మ‌లం పార్టీ మంత్రులు ఉన్నా, వారిని నామ‌మాత్రంగానే చూస్తున్నారు అనే వార్త‌లు వ‌స్తున్నాయి.. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలుగుదేశానికి క‌టీఫ్ చెప్ప‌డానికి మోదీ స‌ర్కార్ కూడా స‌మాలోచ‌న‌లు చేస్తోంది. మ‌రీ ముఖ్యంగా బీజేపీ ఎదుగుదలకు అడ్డంకులు ఏమిటి అనేది తాజాగా కేంద్రం కూడా ప‌రిశీలించింది.
 
ఇక జ‌గ‌న్ పాద‌యాత్ర తర్వాత కేంద్రం జ‌గ‌న్ తో  సంప్ర‌దింపులు జ‌రుపుతుంద‌ని  తెలుస్తోంది... మోదీ కేబినెట్లో ఇద్ద‌రు కీల‌క మంత్రులు  కూడా ఏపీలో ఇరు పార్టీల వ్య‌వ‌హారం ప‌రిశీలిస్తున్నారు అని అంటున్నారు నాయ‌కులు. ముఖ్యంగా జ‌గ‌న్ పార్టీ ప్ర‌జ‌ల్లో మ‌రింత మైలేజ్ తెచ్చుకుంటోంది.. ఇవన్ని కేంద్రం ప‌రిశీలిస్తోంది, అయితే జ‌గ‌న్ కు త్వ‌ర‌లో మోదీ ఓ ఆఫ‌ర్ ఇవ్వనున్నారు అని తెలుస్తోంది.
 
నియోజ‌క‌వ‌ర్గాల పెంపు పై ప్ర‌క‌ట‌న లేదా ఫిరాయింపుల పై కౌంట‌ర్ అనేది నాయ‌కులు చ‌ర్చించుకుంటున్నారు..... ఏపీ బీజేపీ నాయ‌కులు మాత్రం ఇటు తెలుగుదేశానికి క‌టీఫ్ చెప్పి  వైసీపీతో ముందుకు వెళ‌దామ‌ని అంటున్నారు.. ఇక్క‌డ గ‌మ‌నించాల్సింది జ‌గ‌న్ కు మైనార్టీ బ‌లం ఉంది.. ఇక మోదీతో జ‌త‌క‌డితే మైనార్టీలు వైసీపీకి దూరం అవుతారు అనేవార్త‌లు ఆస్ధాన మీడియా ఇప్ప‌టికే వైర‌ల్ చేస్తోంది.. కాని ఇవన్ని రూమ‌ర్లు గానే ప‌రిగ‌ణించాలి.. ఎందుకంటే ఇటు యూపీ ఎన్నిక‌ల్లో మెజార్టీ మైనార్టీలు బీజేపీ వైపే ఓట్లు మ‌ళ్లించారు అనేది సీనియ‌ర్ మేధావుల విశ్లేష‌ణ‌.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.