టీడీపీని వీడ‌నున్న బాబు ఆప్తుడు?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-24 11:46:02

టీడీపీని వీడ‌నున్న బాబు ఆప్తుడు?

ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఇటు తెలంగాణ‌లో కూడా త‌న ప‌ట్టును నిల‌బెట్టుకుందామ‌ని చూస్తోంది.. అయితే ఇటు టీఆర్ ఎస్ దెబ్బ‌కు, ఓటుకు నోటు కేసుకు కాస్త తల‌వంచి ఆచితూచి అడుగులు వేస్తోంది సైకిల్ పార్టీ ..ఇక  టీడీపీలో కేసీఆర్ పై కారాలు మిరియాలు నూరేవారు రేవంత్ రెడ్డి.. ఇటీవ‌ల  కాంగ్రెస్ లోకి వెళ్లిన తర్వాత మ‌రింత విమ‌ర్శ‌ల జోరు పెంచారు రేవంత్.. ఇక మిగిలిన తెలుగుదేశం నాయ‌కులు కూడా తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ లోకి ఆయ‌న వెంట వ‌రుస‌గా క్యూ క‌ట్టారు.. ఇక ప‌లుజిల్లాల్లో ఎమ్మెల్యే స్ధాయి నాయ‌కులు, జిల్లాల అధ్య‌క్షులు కూడా తెలుగుదేశానికి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు.
 
తెంగాణ తెలుగుదేశంలో ఉంటే నూతిలో క‌ప్ప‌ల వ‌లే మ‌నం ఇక ఇలానే ఉంటాము అని భావించిన కొంద‌రు, తెలుగుదేశం నుంచి కారెక్కుతున్నారు.. అలాగే కాంగ్రెస్ గూటికి కూడా చేరుతున్నారు.. తాజాగా బాబుకు అత్యంత ఆప్తుడు, బాబుకు న‌మ్మిన నాయ‌కుడు, పార్టీకి బ్యాక్ బోన్ గా నిలుచునే నాయ‌కుడు అయిన, ఖ‌మ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు అనే వార్త తెలంగాణ పాలిటిక్స్ లో చ‌ర్చ‌కు వ‌స్తోంది.
 
నామా సీనియ‌ర్ నాయ‌కుడు ఆయ‌న‌కు టీఆర్ ఎస్ నుంచి ఆఫ‌ర్ ఎప్ప‌టి నుంచో ఉంది.. కాని ఇప్ప‌టికే అదే సామాజిక వ‌ర్గానికి చెందిన జిల్లా టీఆర్ ఎస్ నాయ‌కుడు, తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు మంత్రిగా ఉండ‌టం ఆయ‌న‌తో విభేదాలు ఉండ‌టంతో నామా చూపు కాంగ్రెస్ వైపు మ‌ళ్లింది అంటున్నారు.. ఇటు రేవంత్ కూడా కాంగ్రెస్ పార్టీలో చురుకుగా ఉండ‌టంతో కాంగ్రెస్ గూటికి ఆయ‌న మూహూర్తం ఫిక్స్ అయింది అని తెలుస్తోంది.
 
నామా నాగేశ్వ‌ర‌రావుకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఖ‌మ్మం ఎంపీగా టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఒకే చేసింది అని తెలుస్తోంది.. అయితే ఇదే విష‌యం బాబుకు కూడా నామా నాగేశ్వ‌ర‌రావు ఇప్ప‌టికే తెలియ‌చేశార‌ట‌... అయితే తెలంగాణ‌లో కాంగ్రెస్ కు తెలుగుదేశం నాయ‌కులు అందరూ ద‌గ్గ‌ర అవ‌డం చూస్తుంటే, ఇటు బాబు బీజేపీకి సైడ్ అవుతూ కాంగ్రెస్ కు ద‌గ్గ‌ర అవుతున్నార‌ని, అందుకే నాయ‌కుల‌ను ముందుగా కాంగ్రెస్ గూటికి చేరుస్తున్నారు అనే వార్త‌లు వ‌స్తున్నాయి.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.