లోకేష్ పరువు తీసిన యార్ల‌గ‌డ్డ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-04 01:11:02

లోకేష్ పరువు తీసిన యార్ల‌గ‌డ్డ

ప్రపంచ తెలుగు సమాఖ్య 11వ ద్వైవార్షిక అంతర్జాతీయ మహాసభలు, రజతోత్సవ వేడుక అధ్యక్షురాలు వీఎల్‌ ఇందిరాదత్‌ అధ్యక్షతన చెన్నైలో శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్య‌క్ర‌మానికి బహుభాషా కోవిదుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, తమిళనాడు క్రీడలశాఖ మంత్రి, తెలుగువారైన పి.బాలకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ ఎంవీవీఎస్‌ మూర్తి హాజ‌ర‌య్యారు.  
 
యార్లగడ్డ లక్ష్మీప్రసాద్  ప్ర‌సంగంలో మాట్లాడుతూ.....  ఏపీ ఐటీ శాఖ మంత్రి  లోకేష్  ఇటీవల  సిలికాన్‌కు వెళ్లి అక్కడున్న ఆంధ్రులకు తెలుగు భాషను కాపాడాల‌ని, మ‌న  సంస్కృతులకు సంబంధించిన కార్య‌క్ర‌మాల‌ను ఇక్క‌డ ఘ‌నంగా చేయిస్తాం..మీ వంతు స‌హ‌యం చేయాల‌ని మంత్రి లోకేష్ కొరారు అని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాషకు పట్టిన దుస్థితి ఈ విధంగా వుందని ఆయ‌న‌ అన్నారు
 
ఆంధ్రప్ర‌దేశ్‌లో తెలుగుభాష క‌నుమ‌రగ‌య్యే  విధానాల‌ను తీసుకొస్తున్నారు. ఏపీలోని అంగన్‌వాడీ పాఠశాలల్లో తెలుగు మాధ్య‌మాన్ని, ఆంగ్లమాధ్యమంగా మార్చే దుర్భర పరిస్థితిలో ఉన్నాము.  పాల‌కుల‌ను విమ‌ర్శిస్తే లాభం లేదు ఎందుకంటే మళ్లీ ఎన్నికల్లో గెలవాలి, కొడుకుని, మనవడిని, మునిమనవడిని సీఎంగా చేసుకోవాలి. ఆ స్థానంలో ఎవ‌రు ఉన్నా అలానే చేస్తారు అని అన్నారు.
 
తెలుగు భాష‌ను ప‌రిర‌క్షించుకునేందుకు ఉన్న ప్ర‌భుత్వ జీవోల‌ను ఏపీ ప్ర‌భుత్వానికి తెలియ‌జేయండి. ఇక్క‌డ మేమేదో  తెలుగును కాపాడుతున్నామ‌ని మీరు అనుకుంటున్నారు అలాంటిది ఏమి లేదు అని యార్లగడ్డ తెలిపారు. తెలుగు భాష‌ను కాపాడుకోవ‌డానికి మీరు విదేశాల నుంచి వ‌స్తుంటే..... మేము  మీ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి తెలుగును కాపాడుకోవాల‌ని  చెప్ప‌డం విడ్డూరంగా ఉంద‌ని పరోక్షంగా లోకేశ్ పై వ్యాఖ్య‌లు చేశారు యార్లగడ్డ.  

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.