బ‌య‌ట‌ప‌డ్డ బాబు హైడ్రామా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-04 01:00:57

బ‌య‌ట‌ప‌డ్డ బాబు హైడ్రామా

ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ లో తెలుగు రాష్ట్రాల‌కు తీర‌ని అన్యాయం జ‌రిగిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఎన్డీయే కూట‌మిలో భాగ‌స్వామ్య‌మైన తెలుగుదేశం పార్టీ  బీజేపీతో పొత్తుపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోనుంద‌నే దానిపై ఇప్పుడు స‌స్సెన్స్ కొన‌సాగుతోంది. 
 
ఓటుకు నోటు కేసు వ్య‌వ‌హారంలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రంపై యుద్దం ప్ర‌క‌టించే స్ధితిలో  ఇప్పుడు లేరు. దీంతో బీజేపీని  నేరుగా ఎదుర్కోలేక కొత్త హైడ్రామాకు తెర లేపిన‌ట్లు తెలుస్తోంది. మ‌హారాష్ట్ర రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర పోషిస్తున్న శివ‌సేన అధినేత ఉద్దావ్ ధాక్రేతో, చంద్ర‌బాబు ర‌హ‌స్యంగా మంత‌నాలు జ‌రిపిన‌ట్లు ప్ర‌ముఖ జాతీయ దిన‌ప‌త్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా  లో క‌థ‌నం ప్ర‌చురిత‌మైంది. అయితే ఈ విష‌యాన్ని కావాల‌నే  మీడియాకు లీకులు ఇచ్చార‌నే వార్త‌లు కూడా తెర‌పైకి వ‌స్తున్నాయి. 
 
తాజాగా శివ‌సేన‌, బీజేపీతో తెగ‌దెంపులు  చేసుకున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. బీజేపీకి వ్య‌తిరేకంగా ప‌లు పార్టీల‌తో జ‌త‌క‌ట్టేందుకు సిద్ద‌మైన‌ట్లుగా చంద్ర‌బాబు ఇలా  కేంద్రానికి  ప‌రోక్షంగా సంకేతాలు పంపుతున్నారని  తెలుస్తోంది. అయితే కేంద్రంలో పూర్తి స్ధాయి మెజారిటీలో  కొన‌సాగుతున్న క‌మ‌లనాధులు బాబు తాటాకు చ‌ప్పుల్ల‌కు బ‌య‌ప‌డే ప్ర‌స‌క్తే లేద‌నేది విశ్లేష‌కుల మాట‌. మ‌రి ఇలాంటి ప‌రిస్ధితుల్లో చంద్ర‌బాబు నిర్ణ‌యం ఎలా ఉంటుందనేది వేచి చూడాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.