ఆ కంపెనీకి పోల‌వ‌రం ప‌నులు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-31 11:18:54

ఆ కంపెనీకి పోల‌వ‌రం ప‌నులు

దేశంలో నిర్మిస్తున్న బ‌హుళార్ధ‌క పోల‌వ‌రం ప్రాజెక్ట్ పై నీలినీడ‌లు అలుముకున్న సంగ‌తి తెలిసిందే.. దీనిపై తెలుగుదేశం ఓ మాట, కేంద్రం ఓ మాట చెప్ప‌డంతో ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి అవుతుందా అని అంద‌రూ ఎదురుచూశారు.. చివ‌ర‌కు దీనిపై కేంద్రం ఓ నిర్ణ‌యానికి వ‌చ్చింది... పోల‌వ‌రం ప్రాజెక్ట్ కాంక్రీట్ ప‌నుల‌ను న‌వ‌యుగ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీకి అప్ప‌గించాలి అని కేంద్రం నిర్ణ‌యం తీసుకుంది.

తాజా వ‌ర్క్ ఆర్డ‌ర్ తో స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌ పనులను ఈ సంస్థ చేపట్టనుంది....పోల‌వ‌రం బాధ్య‌త‌లు చూస్తున్న కేంద్ర జలవనరుల శాఖ మంత్రి, నితిన్‌ గడ్కరీ దీనిపై స్ప‌ష్ట‌మైన నిర్ణ‌యం తీసుకున్నారు. ప్రాజెక్టులో స్పిల్‌వే కాంక్రీటు, స్పిల్‌ ఛానల్‌ పనులను న‌వ‌యుగ కంపెనీకి క‌ట్ట‌బెట్టింది కేంద్రం.

అయితే కొత్త రేటు కొట్ కంటే పాత ధ‌ర‌కు ప‌నులు చేప‌ట్టేందుకు న‌వ‌యుగ సంస్ద ముందుకు వ‌చ్చింది.. దీంతో కేంద్రం ఆ కంపెనీకి కాంట్రాక్ట్ ప‌నులు అప్ప‌గించింది....పాత ధరల ప్రకారం రూ.1196 కోట్లకు నవయుగ సంస్థ పనులు చేపట్టనుంది. గతంలో ఏపీ సర్కార్‌ రూ.1483 కోట్లకు అంచనాలు పెంచి టెండర్లు పిలిచిన విషయం తెలిసిందే. అయితే ఆ టెండర్లకు పీపీఏ సమావేశంలో కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్రం అభ్యంతరంతో పాత ధరకే నవయుగ కొత్త కాంట్రాక్ట్‌ను చేపడుతోంది. మొత్తానికి కేంద్రం క‌ల‌గ‌చేసుకుని దీనిపై ఓ స్ప‌ష్ట‌త క్లారిటీ తీసుకువచ్చి ప‌నుల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది అంటున్నారు మేధావులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.