తోపుదుర్తిని అడ్డుకున్న మంత్రి ప‌రిటాల‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-05 05:35:13

తోపుదుర్తిని అడ్డుకున్న మంత్రి ప‌రిటాల‌

ఒక వైపు  వైయ‌స్ జ‌గ‌న్‌మొహ‌న్ రెడ్డి ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్రలో  ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకుంటూ... అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌ర‌త్నాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నారు. వైయ‌స్ జ‌గ‌న్‌. స్థానిక నాయ‌కుల‌కు స‌ల‌హాలు ఇస్తూ  దిశా నిర్ధేశం చేస్తూ ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని సూచించారు.
 
అందులో భాగంగానే నంత‌పురం జిల్లా రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గ వైయ‌స్ఆర్‌సీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త తోపుదుర్తి ప్ర‌కాష్ రెడ్డి నిత్యం ప్ర‌జా స‌మ‌స్య‌ల పై పొరాడుతూ వ‌స్తున్నారు. పేరూర్ డ్యాంకు నీటిని విడుద‌ల చేయించ‌డం, ఆయ‌క‌ట్టుకు సాగు నీళ్ల విడుద‌ల‌ విష‌యం పై రైతుల‌తో మాట్లాడడానికి ఆదివారం స‌మావేశానికి  పిలుపునిచ్చారు ప్ర‌కాష్ రెడ్డి.  ఈ కార్య‌క్ర‌మానికి త‌గిన బందోబ‌స్తు క‌ల్పించాల‌ని  జిల్లా ఎస్పీగారిని సైతం కోరారు.
 
రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గ వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున  కార్య‌క్ర‌మానికి  హ‌జ‌రు అవ‌క‌డానికి  సిద్ద‌మ‌య్యారు. అయితే పొలీసులు అడుగ‌డుగున  వైసీపీ శ్రేణుల‌కు ఆటంకం క‌లిగించారు.  ప్ర‌కాష్ రెడ్డి పిలుపునిచ్చిన కార్య‌క్ర‌మానికి ఎవ‌రూ హ‌జ‌రుకానివ్వ‌కూడ‌ద‌ని పొలీసుల పై మంత్రి సునిత ఒత్తిడి తీసుకువ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.
 
 పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను కూడా హౌస్ ఆరెస్ట్ చేయ‌డంతోపాటు  గ్రామాల్లో పెద్ద ఎత్తున పొలీసులు మొహ‌రించ‌డంతో ప్ర‌జ‌ల్లో ప్ర‌కాష్ రెడ్డికి  భారీగా  ఫాలోయింగ్ ఉంద‌ని. ఆయ‌నంటే మంత్రి ప‌రిటాల కుటుంబం కూడా భ‌య‌ప‌డుతోంద‌ని తెలుస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.