పార్లమెంట్ లో పోటా పోటీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-05 12:13:17

పార్లమెంట్ లో పోటా పోటీ

కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు అన్యాయం జ‌ర‌గ‌డంతో పార్ల‌మెంట్ లో  యుద్దం చేసేందుకు  తెలుగుదేశం పార్టీ, వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ద‌మయ్యాయి. సోమ‌వారం నాడు మొద‌లైన పార్ల‌మెంట్ స‌మావేశంలో  ఏపీకి ప్ర‌త్యేక హోదాతో పాటు విభ‌జ‌న హామీలు  అమలుపై చ‌ర్చించేందుకు రూల్ 184వ నిబంధ‌న కింద చ‌ర్చ‌కు అనుమ‌తించాల‌ని నోటీసు ఇచ్చింది.
 
మ‌రోవైపు అధికార తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా  193 వ నిబంధ‌న కింద టీడీపీ ఎంపీలు నోటీస్ ఇచ్చారు.  మిత్ర ధ‌ర్మాన్ని  ప‌క్క‌కు పెట్టి  కేంద్ర‌ప్ర‌భుత్వ తీరుకు నిర‌స‌న‌గా పార్ల‌మెంట్ లో టీడీపీ ఎంపీలు  ప్లకార్డులు ప్ర‌ద‌ర్శించ‌డం గ‌మ‌నార్హం. 
 
ఏపీకి ప్ర‌త్యేక హోదాతో పాటు రాయ‌ల‌సీమ ఉత్త‌రాంధ్ర‌కు ప్ర‌త్యేక నిధి పోల‌వ‌రం, రాయ‌ప‌ట్నం ఓడ‌రేవు పూర్తి చేయాల‌ని వైకాపా ఎంపీ వైవీ సుబ్బా రెడ్డి కోరారు. తిరుప‌తిలో వెంక‌న్న సాక్షిగా ఏపీకి అనేక హామీలు ఇచ్చార‌ని, అందులో ఏ ఒక్క‌టీ నెర‌వేర్చ‌లేద‌ని, వెంట‌నే ఏపీ ప్ర‌జ‌లు సంతృప్తి ప‌డేలా స‌మాధానం ఇవ్వాల‌ని టీడీపీ ఎంపీ శివ‌ప్ర‌సాద్ మోదీని కోరారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.