అనంత‌లో అజ్ఝాత‌వాసి టూర్ హైలెట్స్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-27 04:46:11

అనంత‌లో అజ్ఝాత‌వాసి టూర్ హైలెట్స్

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూడు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా క‌రువు యాత్ర పేరుతో అనంత‌పురం జిల్లా చేరుకున్నారు. గ‌తంలో ప్ర‌ట‌కించిన విధంగా పార్టీ కార్యాల‌యానికి శ‌నివారం నాడు ఉద‌యం శంఖుస్ధాప‌న చేశారు. అనంత‌రం ఆయ‌న జిల్లా రైతుల‌తో ముఖాముఖి ఏర్పాటు చేసి వారి స‌మ‌స్య‌ల‌ను వివ‌రించాల్సింది గా కోరారు.

ఈ కార్య‌క్ర‌మంలో వివిధ ప్రాంతాల నుండి వ‌చ్చిన రైతులు త‌మ స‌మ‌స్య‌ల‌ను ప‌వ‌న్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువ‌చ్చారు. రైతులు ప్రధానంగా చెప్పుకున్న స‌మ‌స్య‌లు క్లుప్తంగా.....

1.అనంత‌పురం జిల్లాలో వ‌రుస క‌రువులు

2.ప్రభుత్వ స‌హాయం కోసం ఎదురు చూస్తున్న రైత‌న్న‌లు

3. సీమ‌లో క‌రువులో పుడుతున్నారు..క‌రువులోనే పెరిగి క‌రువ‌లోనే జీవితం అంతం చేసుకుంటున్నారు....

4.వర్షాపాతం త‌క్కువ కావ‌డంతో సాగునీటి కోసం ఇబ్బందులు ప‌డుతున్నారు.

5.గ్రైండ్ వాట‌ర్ త‌గ్గిపోయింది...రైత‌న్న‌లు నీటి కోసం అప్పులు చేసి మ‌రీ బోర్లు వేసుకుని ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నారు.

6.ఉమ్మ‌డి మ‌ద్రాస్ హ‌యాంలో నిర్మించిన తుంగ్ర‌భ‌ద్రా డ్యాం నుండి హ‌క్కుగా రావాల్సిన నీటీ వాటాను పొంద‌లేక‌పోతున్నాము.

7.న‌దుల పూడిక కూడా క‌రువుకు కార‌ణం

8. ఎగువ‌న డ్యాంలు నిర్మించ‌డం

9.బుక్క‌ప‌ట్నం ప్రాంతంలో ఉన్న అడ‌విని న‌రికేసి రైలు ప‌ట్టాల కోసం వాడేశారు.

10.అడ‌వుల న‌రికివేత కూడా అనంత ఎడారిలా క‌నిపించేందుకు కార‌ణం

11.సీమ జిల్లాల‌కు హ‌క్కుగా రావాల్సిన నీట‌ని వాటాను కేటాయించాలి.

12.తుంగ్ర‌భ‌ద్ర‌కు స‌మాంత‌ర కాలువ త‌వ్వాలి. ఇరిగేష‌న్ కు ప్ర‌త్య‌మ్నాయాన్ని వెత‌కాలి

13. చెరువుల‌ను నింపేట‌పుడు పూటిక తియ్యాలి.

14.నకిలీ విత్తనాల‌తో రైతులు మోసపోతున్నారు.

15.చిరు ధాన్యాలు వేసే విధంగా రైతుల‌కు అవ‌గాహ‌న స‌ద‌స్సులు ఏర్పాటు చేయాలి.

16. ప్ర‌భుత్వం అందించే ఇన్ పుట్ స‌బ్సీడీ లు స‌క్ర‌మంగా అందించాలి.

17.రైతులు పండిచే పంట‌ల‌కు గిట్టుబాటు ధ‌ర‌లు క‌ల్పించాలి.

18. పంట‌ల‌కు వాడే ఎరువుల‌పై ట్యాక్స్ తీసేయాలి...

19.అనంత‌ను ప్ర‌త్యేక నిధుల‌తో ఆదుకోవాలి

20.త్రాగు, నీరు సాగు నీరు విద్యుత్ ఇస్తే రైతులు సంతోషిస్తారు....

వీటితో పాటు అనేక స‌మ‌స్య‌ల‌ను రైతులు ప‌వ‌న్ క‌ళ్యాణ్ దృష్టికి తీసుకువ‌చ్చారు. వీట‌న్నింటిని ప‌వ‌న్ నోట్ చేసుకోవ‌డంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వ దృష్టికి తీసుకెళ్తాన‌ని హామీ ఇచ్చారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.