రేపే అనంత టూర్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-26 04:31:00

రేపే అనంత టూర్

సినీ న‌టుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో కార్య‌చ‌ర‌ణ‌ను వేగ‌వంతం చేశారు. తెలంగాణ‌లో ప‌ర్య‌టించిన ప‌వ‌న్ శనివారం నుండి అనంత‌పురం జిల్లాలో మూడు రోజుల పాటు క‌రువు యాత్ర పేరుతో ప‌ర్య‌టించనున్నారు.

ప్ర‌స్తుతం రాయ‌ల‌సీమ ధ‌ర్నాలు, నిస‌ర‌న‌లు, దీక్ష‌ల‌తో ద‌ద్ద‌రిల్లుతోంది. హైకోర్టును క‌ర్నూల్లో ఏర్పాటు చేయాల‌ని కోరుతూ లాయ‌ర్లు అంద‌రూ ఏక‌మై ప్ర‌జా సంఘాలు, విద్యార్ధి సంఘాలను క‌లుపుకుని ఉద్య‌మాన్ని కొన‌సాగిస్తున్నారు. మ‌రోవైపు క‌డ‌ప ఉక్కు-రాయ‌ల‌సీమ హ‌క్కు నినాదంతో క‌డ‌ప‌లో కూడా ఉద్య‌మాన్ని ఉదృతం చేశాయి. అఖిల‌ప‌క్షం ఆధ్వ‌ర్యంలో గురువారం నాడు బంద్ నిర్వ‌హించారు. ప్ర‌జాసంఘాలు ఉక్కు ఫ్యాక్ట‌రీ కోసం దీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు.

హైకోర్టును రాయ‌ల‌సీమ‌లో ఏర్పాటు చేయాల‌ని కోరుతూ అనంతపురం జిల్లాలోని ప‌లు ప్ర‌జాసంఘాలు, విద్యార్ధి సంఘాలు దీక్ష‌లు, నిర‌స‌న కార్య‌క్ర‌మాలు కొన‌సాగిస్తున్నారు. ఈ క్ర‌మంలో ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. గ‌త ప‌ర్య‌ట‌న‌లో సీమ‌కు 400 టీఎంసీలు కేటాయింపుతో పాటు ప‌లు స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించారు.

ఇప్పుడు కూడా త‌మ స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వం దృష్టికి తీసుకుకెళ్లాల‌ని కోరేందుకు లాయ‌ర్లు, విద్యార్ధి సంఘాలు, ప్ర‌జాసంఘాలు, మేధావులు ప‌వన్ క‌ళ్యాన్ ను క‌లిసేందుకు అనుమ‌తి తీసుకున్నారు. ముఖ్యంగా హైకోర్టు, క‌డ‌ప ఉక్కు అంశాల‌పై ప్ర‌క‌ట‌న చేయాల‌ని వారు ప‌వ‌న్ ను కోరనున్నారు.

ఒక‌వేళ సీమ వాదుల కోరిక మేర‌కు హైకోర్టు క‌ర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయాల‌ని ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న చేస్తే ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కూడా స్పందించాల్సి ఉంటుంద‌ని అంటున్నారు. అధికార, ప్ర‌తిప‌క్ష హోదాలో రాల‌య‌సీమ ప్రాంతానికి చెందిన నేత‌లు ఉన్నా కూడా... త‌మ‌కు న్యాయం జ‌ర‌గ‌టం లేద‌ని సీమ ప్రాంత ప్ర‌జ‌లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఉక్కు ప‌రిశ్ర‌మ‌తో పాటు క‌ర్నూల్లో హైకోర్టు కోసం పోరాడాల‌ని సీమ వాదులు డిమాండ్ చేస్తున్నారు.

మ‌రి హైకోర్టుపై ప‌వ‌న్ వెర్ష‌న్‌ ఏంటి..... హైకోర్టు విష‌యంలో జ‌గ‌న్ స్పంద‌న ఎలా ఉంటుంది.... తెలంగాణలో జై తెలంగాణ నినాదాన్ని ఇచ్చిన ప‌వ‌న్ సీమ‌లో కూడా జై రాయ‌ల‌సీమ నినాదాన్ని అందుకుంటారా......సీమ‌వాదానికి ప‌వ‌న్ మ‌ద్ద‌తు ఉంటుందా.... అనేది చూడాలి మ‌రి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.