ప‌వ‌న్ టాక్ పై అనంత‌లో గ‌రం గ‌రం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-24 12:29:46

ప‌వ‌న్ టాక్ పై అనంత‌లో గ‌రం గ‌రం

అన్నీ రోజులు ఒకేలా ఉండ‌రు అన్ని స‌మయాలు ఓకేలా గ‌డ‌వ‌వు అని ఊరికినే అన‌లేదు పెద్ద‌లు.. ఈరోజు ఉన్న‌ది రేపు ఉండదు రేపు జ‌రిగిన‌ది భ‌విష్య‌త్తులో జరుగ‌దు అని చెప్ప‌లేమే జ‌రుగ‌బోదు అని చెప్ప‌లేము.. వైశాల్యంలో పెద్ద జిల్లా ఏది అంటే ట‌క్కున చెబుతారు ఏపీలో అనంత‌పురం జిల్లా అని.. అలాగే జ‌నాభాలో ఏ జిల్లా పెద్ద‌ది అంటే పుస్త‌కాల్లో ఉన్న పేరును అలాగే చెబుతారు.. అయితే ఇటు ప‌వ‌న్ రాజ‌కీయ యాత్ర ఇంట్ర‌స్టింగ్ గా జ‌రుగుతోంది.. తాను ప్ర‌శ్నించ‌డానికి పార్టీ పెట్టా అని చెప్పిన ప‌వ‌న్, తాజాగా త‌న రాజ‌కీయ యాత్ర‌లో మ‌రో కొత్త యాంగిల్ ను సెంట‌ర్ చేశారు.
 
ఎవ‌రితోనూ వివాదాలు పెట్టుకోను ఎవ‌రిని తాను టార్గెట్ చేయ‌ను అన్నారు.. ఇక్క‌డ వ‌ర‌కూ బాగానే ఉంది.. అయితే ఏదైనా రాజకీయ పార్టీ అధికార పార్టీ చేసే అక్ర‌మాలు బ‌య‌ట‌కు తీసుకురావాలి.. ఒక‌వేళ బ‌య‌ట‌కు వ‌స్తే వాటిని నిల‌దీయాలి.. ప్ర‌జ‌ల‌కు నిజా నిజాలు తెలియ‌చేయాలి.. కాని జ‌న‌సేన స్టైల్ వేరుగా ఉంది.. ఇరు తెలుగు రాష్ట్రాల్లో పాల‌న బాగుంది ఇరువురు సీఎంలు క‌ష్ట ప‌డుతున్నారు అని ప‌వ‌న్ అంటున్నారు.. మ‌రి ఎవ‌రిని ప్ర‌శ్నిస్తున్నారు అంటే స‌మాధానం లేని ప్రశ్న‌గా మిగిలిపోతోంది?  బ‌హుశా దేశంలో ఎక్క‌డా ఓ పార్టీ ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను తిట్ట‌డం ఇదే మొద‌టిసారి అయి ఉంటుంది.. ఇటు తెలంగాణ‌లో కూడా కాంగ్రెస్ నాయ‌కులు ప‌వ‌న్ ఆలోచ‌న పై యాత్రపై స‌టైర్లు వేస్తున్నారు.
 
అయితే 13 జిల్లాలు ఉన్న ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను అనంత నుంచి పోటీ చేస్తాను అని ప‌వ‌న్ గ‌తంలోనే తెలిపారు.. ఇటీవ‌ల ఇక్క‌డ రాష్ట్ర కార్యాల‌యం కూడా ఏర్పాటు చేయ‌నున్నారు.. ఇప్పుడు తాజాగా ఆయ‌న చెప్పిన ఓ వార్త ఆస‌క్తి క‌రంగా మారింది.అనంత‌పురం జిల్లాలో క‌ర‌వు గురించి పోరాటం చేస్తా అన్నారు.. దీంతో రాయ‌ల‌సీమ నాలుగు జిల్లాలు ఉలిక్కి ప‌డ్డాయి.. ప్ర‌స్తుతం అనంత‌లో క‌ర‌వు ప‌రిస్దితి లేదు.. అక్క‌డ గ‌తంలో కంటే ఈసారి డ్రాట్ లెక్క త‌గ్గింది.. ఇది ప‌వ‌న్ గుర్తించ‌లేదా, బ‌హుశా ఆయ‌న మిత్ర‌బంధం కొన‌సాగిస్తున్న పార్టీ రెయిన్ గ‌న్స్ ఎఫెక్టో, లేక వ‌ర్షాల వ‌ల్ల పుష్క‌లంగా పుష్క‌రిణిలా నిండిని చెరువులో తెలియ‌దు కాని ఇప్పుడు అనంత‌లో క‌ర‌వు చాయ‌లు లేవు.. మ‌రి క‌ర‌వు లేని చోట క‌ర‌వు యాత్ర ఏమిటి అని అక్క‌డ సీనియ‌ర్లు గ‌రం గ‌రంగా ఉన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.