జేసి బ్ర‌ద‌ర్స్ కోట‌కు బీట‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-04 02:00:59

జేసి బ్ర‌ద‌ర్స్ కోట‌కు బీట‌లు

అనంత‌పురం జిల్లా రాజ‌కీయాల్లో జేసి బ్ర‌ద‌ర్స్‌కు ఒక ప్ర‌త్యేక‌మైన స్థానం ఉంది. ముఖ్యంగా  సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన  తాడిప‌త్రిలో జేసి ఫ్యామిలీకి తిరుగులేదు. 1985 నుంచి 2014 సంవ‌త్స‌రం వ‌ర‌కు ఏడు ప‌ర్యాయాలు ఏక‌ధాటిగా ఎమ్మెల్యే అయిన ఘ‌న చ‌రిత్ర జేసి బ్ర‌ద‌ర్స్‌ సొంతం.  గ‌త  సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అనంత‌పురం ఎంపీగా  జేసి దివాక‌ర్ రెడ్డి, తాడిప‌త్రి ఎమ్మెల్యేగా జేసి ప్ర‌భాక‌ర్ రెడ్డి నెగ్గారు. 
 
అయితే,  ప్ర‌స్తుతం జేసి బ్ర‌ద‌ర్స్ కోట‌కు బీట‌లు ప‌డుతున్నాయి. ఇటీవ‌ల జేసీ  ఫ్యామిలీకి ప్రధాన అనుచరుడు కాకర్ల రంగనాథ్‌కు మ‌ధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో రంగనాథ్‌ జేసీ వర్గం నుంచి వైదొలిగాడు. అయితే జనవరి ఒకటిన జేసీ ప్రధాన అనుచరుడు కాకర్ల రంగనాథ్‌ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు మంత్రి పరిటాల సునీత ఇంటికి వెళ్లారు.
 
ఈ విష‌యం తెలుసుకున్న‌ జేసి అనుచ‌రులు కాకర్ల రంగనాథ్‌ సోదరుడు నిర్వహిస్తున్న ట్రావెల్స్ కార్యాలయంపై దాడి చేసి ధ్వంసం  చేశారు. ఈ దాడి ఎమ్మెల్యే జేసి చేయించార‌ని త‌న అనుచ‌రుల‌తో రంగనాథ్ రోడ్డు ఎక్కిన విష‌యం తెలిసిందే. ఇరు వ‌ర్గాల మ‌ధ్య  అప్ప‌టి నుంచి విభేదాలు కొన‌సాగిస్తున్నారు.
 
తాజాగా మ‌రోసారి విభేదాలు భ‌గ్గుమ‌న్నాయి. ట్రాన్స్‌పోర్ట్‌కు సంబంధించిన విష‌యంలో జేసీ అనుచరులైన శివ, ప్రసాద్‌లపై శనివారం ప్రత్యర్థులు దాడి చేశారు. టీడీపీకి చెందిన కాకర్ల రంగనాథ్ ఈ  దాడి చేయించి  ఉంటారని అనుకున్న‌ జేసీ వర్గీయులు...... రంగ‌నాధ్  బామ్మర్ది అయిన ప్రసాద్‌నాయుడు ఇంటిపై దాడిచేసి, సామాగ్రిని ధ్వంసం చేశారు. దీంతో తాడిప‌త్రి పట్టణంలో  ఉద్రిక్త పరిస్థితులు నెల‌కొన్నాయి. ఈ దాడులు ఇలాగే కొన‌సాగితే వ‌ర్గ పోరు భ‌రించ‌లేక  అనుచ‌రులు జేసీ ఫ్యామిలిని వీడే  ప‌రిస్థితి వ‌స్తుంది... దీంతో జేసి బ్ర‌ద‌ర్స్ కోట‌కు బీట‌లు వాల‌డం ఖాయ‌మ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.