బాంబు పేల్చిన చిన్న‌మ్మ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-27 06:23:09

బాంబు పేల్చిన చిన్న‌మ్మ

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఓ ర‌కంగా వివాదంలో చిక్కుకున్నారు. బీజేపీ నేత‌లు విమ‌ర్శిస్తున్నా.... మిత్ర ప‌క్షం కావున వారిని తాను ఏమీ అన‌డం లేద‌ని, బీజేపీ నేత‌ల‌ను కంట్రోల్ చేయాల‌ని ఆ పార్టీ అధిష్టానాన్ని చంద్ర‌బాబు కోర‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

మా వాళ్ల‌కు కూడా చెప్పాను... అన‌వ‌స‌రంగా స్పందించ వ‌ద్ద‌ని, ఒక‌వేళ వ‌ద్ద‌నుకుంటే అప్పుడు న‌మ‌స్కారం పెట్టి వ‌దిలేద్దామ‌ని చంద్ర‌బాబు అన్నారు. దీంతో బాబు వ్యాఖ్య‌ల‌పై బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వ‌రి స్పందించారు.

బీజేపీ మిత్ర ప‌క్షం పాటించ‌డం లేద‌ని చంద్ర‌బాబు పేర్కోన‌డం స‌మంజసం కాద‌ని పురందేశ్వ‌రి మండిప‌డ్డారు. త‌మ‌తో క‌లిసి ఉంటారో లేదో తేల్చుకోవాల‌ని ఆమె అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను టీడీపీ స‌ర్కార్ పేర్లు మార్చేసి రాష్ట్ర ప్ర‌భుత్వానిదిగా చూపించి ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తోంద‌ని ఆమె ఎద్దేవా చేశారు.

ఫిరాయింపు ఎమ్మెల్యేల పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ అమిత్ షాకు లేక రాసిన‌ట్లు పురందేశ్వ‌రి మీడియాకు తెలిపారు. మ‌రోవైపు సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌పై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూడా మండిప‌డ్డారు. పొత్తు ధ‌ర్మం ఇప్పుడు గుర్తుకు వ‌చ్చిందా... అని ప్ర‌శ్నించారు. చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌పై మా పార్టీ అధిష్టానం త్వ‌ర‌లోనే స్పందిస్తుంద‌ని అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.