స‌ర్కార్ కు చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న న్యాయ‌వాదులు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-23 11:07:24

స‌ర్కార్ కు చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న న్యాయ‌వాదులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో మ‌రో ఉద్య‌మం ఊపిరిపోసుకుంది. ఇప్ప‌టికీ రాయ‌ల‌సీమ స‌మ‌స్య‌ల‌పై అక్క‌డ ప్ర‌జ‌లు, ఉద్య‌మ‌కారులు నిర‌స‌న‌లు, ధ‌ర్నాలు చేప‌డుతూనే ఉన్నారు. ప్ర‌భుత్వాలు  ఎన్ని మారినా పాల‌కులు మాత్రం రాయ‌ల‌సీమ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంలో  విఫ‌లం అవుతూనే ఉన్నారు. 
 
ప్ర‌స్తుతం ఏపీలో అధికారంలో ఉన్న తెలుదేశం పార్టీ కూడా రాయ‌ల‌సీమ‌ను విస్మ‌రిస్తోంద‌ని సీమ ప్ర‌జ‌లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. విభ‌జ‌న త‌ర్వాత అభివృద్దిని ఒకే చోట కేంద్రీక‌ర‌ణ  చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు టీడీపీ ప్ర‌భుత్వంపై ఉన్నాయి. 
 
రాజ‌ధాని ఏర్పాటుతో పాటు ప‌లు కేంద్ర సంస్థ‌లు కోస్తాంధ్ర ప్రాంతంలోనే ఏర్పాటు చేయ‌డంపై సీమ వాసులు భ‌గ్గుమంటున్నారు. ఇప్పుడు హైకోర్టును కూడా ప్ర‌భుత్వం అక్క‌డే ఏర్పాటు చేసేందుకు సిద్ద‌మైన నేపధ్యంలో సీమ న్యాయ‌వాదులు ఉద్య‌మానికి తెర లేపారు. 
 
హైకోర్టుని రాయ‌ల‌సీమ‌లోనే ఏర్పాటు చేయాల‌ని కోరుతూ పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు, ధ‌ర్నాలు, రాస్తోరోకోలు నిర్వ‌హిస్తున్నారు. ఉద్య‌మంలో భాగంగా ప్ర‌భుత్వంపై ఒత్తిడి తీసుకువ‌చ్చేందుకుగానూ  ఏకంగా విధులు బ‌హిష్క‌రిస్తూ నిర‌స‌న తెలియ‌జేస్తున్నారు. 
 
పెద్ద‌లు కుదూర్చుకున్న శ్రీభాగ్ ఒప్పందాన్ని  తుంగ‌లో తొక్కేసి రాయ‌ల‌సీమ‌ను టీడీపీ స‌ర్కార్ విస్మ‌రిస్తోంద‌ని, అభివృద్దిని వికేంద్రీక‌ర‌ణ చేయ‌డం ఏపీకి ఎంతో అవ‌స‌ర‌మ‌ని ప‌లువురు సీనియ‌ర్ నాయ‌కులు ఇప్ప‌టికే  ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రిస్తున్నారు.
 
న్యాయ‌వాదుల ఉద్య‌మంతోనైనా ప్ర‌భుత్వం హైకోర్టును  సీమ‌లో ఏర్పాటు చేస్తుందా....ఓట్లు సీట్ల లెక్క‌లో ప్ర‌భుత్వం సీమ ప్ర‌జ‌ల ఉద్య‌మాన్ని ప‌ట్టించుకుంటుందా....ఒక‌వేళ ప్ర‌భుత్వం సీమ‌ను ప‌ట్టించుకోక‌పోతే ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్యమం త‌ప్ప‌దా.... వీటన్నింటికి స‌మాధానం టీడీపీ ప్ర‌భుత్వ‌మే చెప్పాలి.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.