సీమ‌లో ఉవ్వెత్తున ఎగిసిన ఉద్య‌మం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-25 06:13:10

సీమ‌లో ఉవ్వెత్తున ఎగిసిన ఉద్య‌మం

క‌రువు ప్రాంత‌మైన రాయ‌ల‌సీమ‌లో  మ‌రో ఉద్య‌మం ఉవ్వెత్తున ఎగిసిప‌డింది. ఉక్కు ఫ్యాక్ట‌రీని ఏర్పాటు చేయాల‌ని కోరుతూ... క‌డ‌ప ఉక్కు-రాయ‌సీమ హ‌క్కు అనే నినాదంతో క‌డ‌ప‌లో బంద్ నిర్వ‌హించారు. మ‌రోవైపు క‌ర్నూల్లో హైకోర్టు ఏర్పాటు చేయాల‌ని  డిమాండ్ చేస్తూ  న్యాయ‌వాదులు  ప్ర‌భుత్వంపై ఒత్తిడి తీసుకువ‌చ్చేందుకు నిర‌స‌న‌లు, ధ‌ర్నాలు చేస్తున్నారు.  
 
గురువారం నాడు క‌ర్నూలు, క‌డ‌ప జిల్లాల్లో నిస‌ర‌న‌లు, ర్యాలీల‌తో ద‌ద్ద‌రిల్లింది.  ప్ర‌జాసంఘాలు, విద్యార్ధి సంఘాలతో క‌ల‌సి న్యాయ‌వాదులు దీక్ష‌లు నిర్వ‌హించారు.  శ్రీభాగ్ ఒప్పందాన్ని తుంగ‌లో తొక్కి రాజ‌ధానిని కోస్తాంధ్ర ప్రాంతానికి త‌ర‌లించార‌ని, హైకోర్టును క‌ర్నూల్లో ఏర్పాటు చేయాల‌ని వారు డిమాండ్ చేశారు. 
 
క‌డ‌ప‌లో ఉక్కు ఫ్యాక్ట‌రీని ఏర్పాటు చేయాల‌ని కోరుతూ అఖిల‌ప‌క్షం  ధ‌ర్నా  చేప‌ట్టింది. ఇందులో భాగంగ క‌డ‌ప వ్యాప్తంగా ఆర్టీసీ బ‌స్ స్టాండ్ ల ముందు వైసీపీ, సీపిఐ, సీపిఎం పార్టీ నేత‌లు నిర‌స‌న తెలియ‌జేశారు.  ప‌లువురి ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను  పోలీసులు అరెస్ట్ చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.