రాయ‌పాటి రాజీనామా ? వాట్ ఏ ప్లాన్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-02 04:46:04

రాయ‌పాటి రాజీనామా ? వాట్ ఏ ప్లాన్

ఏపీకి బాబు స‌ర్కార్  ప‌థ‌కాలు నిధులు సాధించ‌డంలో ఈ నాలుగేళ్ల‌ల్లో ఎటువంటి ముందు అడుగు వేయ‌లేక‌పోయింది.. దీంతో బీజేపీ పై క‌న్నా ఏపీలో తెలుగుదేశం పై వ్య‌తిరేక‌త బాగా పెరిగిపోయింది.... ఇక తెలుగుదేశం ఎంపీలు రాజీనామాలు చేయాలి అని వారికి వారే ఆలోచిస్తున్నారు.. ఇక వైసీపీ నాయ‌కులు ఎంపీలు కూడా దీనిపై పెద‌వి విరిచారు.. ఇక సీనియ‌ర్లు జూనియ‌ర్లు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్యేలు ఎటువంటి కామెంట్లు చేయ‌కండి అని బాబు ఓ పక్క‌న చెబుతున్నా దీనిపై కొంద‌రు ఆగ్ర‌హాం వ్య‌క్తం చేస్తున్నారు.
 
 
తాజాగా ఏపీకి జ‌రిగిన అన్యాయం పై తాను రాజీనామాకు సిద్దం అని ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.. ముందుగా సీఎం చంద్ర‌బాబు తో స‌మావేశం అవుతాన‌ని చెప్పారు... ఆ త‌ర్వాత త‌న నిర్ణ‌యం ప్ర‌క‌టిస్తాను అని అన్నారు.
 
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంపీలకు ఎంతో విలువ ఉండేదని కానీ, ఆర్ఎస్ఎస్ ఏది చెబితే బీజేపీ ప్రభుత్వం అదే చేసే పరిస్థితిలో ఉందని ఆయన విమర్శించారు. ఇప్పుడు ఢిల్లీలో ఎంపీలను హీనంగా చూస్తున్నారని, ఏపీకి అన్యాయం చేస్తే కాంగ్రెస్‌కు పట్టిన గతే బీజేపీకి పడుతుందని హెచ్చరించారు. బీజేపీపై ప్రజలలో తీవ్ర ఆగ్రహం ఉందని రాయపాటి విమర్శలు గుప్పించారు.
 
 అయితే రాయ‌పాటి ఎలాగో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌ను అంటున్నారు.. ఈ సారి మంచి పాయింట్ దొరికింది ఇలాగ అయినా రాజీనామా చేస్తే వ‌చ్చే ఎన్నిక‌ల్లో వారసుడి రాజ‌కీయ ఎంట్రీ షురూ అవుతుంది అని అంటున్నారు కొంద‌రు నాయ‌కులు వాట్ ఏ ప్లాన్ స‌ర్ .
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.