వైసీపీ ఎఫెక్ట్.... టీడీపీలో ఆయ‌న‌కు ఎంపీ టికెట్ క‌న్పామ్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-27 03:01:06

వైసీపీ ఎఫెక్ట్.... టీడీపీలో ఆయ‌న‌కు ఎంపీ టికెట్ క‌న్పామ్

అధికార తెలుగుదేశం పార్టీలో కూడా అప్పుడే టికెట్ల గోల మొద‌లైంది. ముఖ్యంగా పార్ల‌మెంటు సీట్ల కేటాయింపు విష‌యంలో టీడీపీ ఎక్కువ జాగ్ర‌త్తలు తీసుకుంటుంది. అందులో కూడా ఆర్ధికంగా, సామాజిక వ‌ర్గం ప‌రంగా పార్టీకి అండ‌గా ఉండే వారికి మొద‌టి ప్రాధాన్య‌త ఇస్తుందన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే.

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న త‌ర్వాత నవ్యాంధ్ర‌ప్ర‌దేశ్ లో రాజ‌ధానిగా అమ‌రావ‌తి ఏర్పాటు నేప‌థ్యంలో గుంటూరు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట‌గా మారింద‌నే చెప్పాలి. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అక్క‌డ పోటీ చేసేందుకు అనేక‌మంది ఆశావాహులు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డి నుండి గ‌ల్లా జ‌య‌దేవ్ పోటీ చేసి గెలుపొందారు. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా గ‌ల్లా జ‌య‌దేవ్ కే గుంటూరు సీటు క‌న్పామ్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. గ‌ల్లా ఆర్ధికంగా బ‌ల‌మైన నాయ‌కుడు. దీనికి తోడు మాజీ మంత్రి గ‌ల్లా అరుణ‌కుమారి వారసుడు కావ‌డం

. ఇవే కాకుండా వైసీపీ కూడా గ‌ల్లా సీటు క‌న్పామ్ కు కార‌ణ‌మ‌నే చెబుతున్నారు. గ‌ల్లాకు సీటు ఇవ్వ‌క‌పోతే ఆయ‌న బామ్మ‌ర్ది సూప‌ర్ స్టార్ మ‌హేష్ ఫ్యామిలీ వైసీపీకి స‌పోర్ట్ ఇచ్చే అవ‌కాశం ఉన్నందున చంద్ర‌బాబు ముంద‌స్తు ఆలోచ‌న‌తో ఈ నిర్ణ యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఎందుకంటే మ‌హేష్ బాబు చిన్నాన్న ఘ‌ట్ట‌మ‌నేని ఆదిశేష‌గిరి రావు ప్ర‌స్తుతం వైకాపాలో కొన‌సాగుతున్నారు.

నంద్యాల ఉప ఎన్నిక‌ల వేళ సూప‌ర్ స్టార్ అభిమానులు వైసీపీకి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించేలా ఘ‌ట్ట‌మ‌నేని చొర‌వ చూపించారు. దీంతో గ‌ల్లాకు సీటు ఇవ్వ‌క‌పోతే ఖ‌చ్చితంగా ఘ‌ట్ట‌మ‌నేని కొన‌సాగుతున్న వైకాపాకు మ‌ద్ద‌తు ఇస్తార‌న్న ఆలోచ‌న‌తోనే గ‌ల్లాకు సీటు క‌న్పామ్ అయిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.