ప‌చ్చ మీడియా గుడ్ న్యూస్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-26 01:54:59

ప‌చ్చ మీడియా గుడ్ న్యూస్

ముందుగా జ‌న‌హితం పాఠ‌కుల‌కు విన్న‌పం.. ఈ వార్త‌లో మా క‌ల్పితం ఏమాత్రం లేదు..ప‌చ్చ మీడియా చేస్తున్న విష‌ప్ర‌చారాన్ని మీ మందు ఉంచుతున్నాం....

గ‌త కొన్ని రోజులుగా ఏపీ రాజ‌కీయాలు హాట్ హాట్ గా కొన‌సాగుతున్న విష‌యం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఏపీకి హోదా ఇచ్చే పార్టీకి మ‌ద్ద‌తు ఇస్తామ‌ని వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌క‌టించడం... దేశ వ్యాప్తంగా ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే ఏపీలో వైసీపీ 13 పార్ల‌మెంట్ స్ధానాలు గెలుస్తుంద‌ని రిప‌బ్లిక‌న్ టీవీ స‌ర్వే ప్ర‌క‌ట‌న రావ‌డం అధికార తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం మింగుడు ప‌డ‌టం లేదు.

దీనికి తోడు ఏపీలో జ‌రిగిన పార్టీ ఫిరాయింపుల‌ను భార‌తీయ జ‌నతా పార్టీ ఎమ్మెల్యే, శాస‌నసభాప‌క్ష‌నేత‌ విష్ణుకుమార్ రాజు త‌ప్పుబ‌ట్ట‌డం అంద‌రికీ తెలిసిందే. క‌ర్ర‌ విర‌గ‌కూడ‌దు.... పాము చావాలి అన్న చందంగా టీడీపీకి చుర‌కలు అంటిస్తుంటారు విష్ణుకుమార్ రాజు.

రాష్ట్రంలో వివిధ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌తో పాటు ఫిరాయింపుల‌ను, గ‌వ‌ర్న‌ర్ తీరును సైతం త‌ప్పు బ‌ట్టిన విష్ణుకుమార్ రాజుపై ప‌చ్చ మీడియా కొత్త పాట అందుకుంది. ఆయ‌న వైసీపీలోకి వెళ్లేందుకు ప్లాన్స్ వేశారంటూ అధికార పార్టీ అనూకూల సోష‌ల్ మీడియా వెబ్ సైట్ల‌లో పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తోంది.

ఈ విష ప్ర‌చారంలో వారికి వ‌చ్చే లాభమేంట‌నేది ప‌క్క‌కు పెడితే... వైసీపీకి మాత్రం సానుకూల‌మైన అంశ‌మ‌నే చెప్పాలి. రాజ‌కీయాల్లో శాశ్వ‌త మిత్రులు.... శాశ్వ‌త శ‌త్రువులు ఉండ‌రు అనే సామెత మీరు వినే ఉంటారు.. పచ్చ మీడియా ప్ర‌చారం చేస్తున్న‌ట్లు బీజేపీ లో కీల‌క పాత్ర పోషిస్తూ, రాష్ట్ర ఆర్ధిక, సామాజిక, భౌగోళిక అంశాల‌పై పూర్తి స్ధాయిలో అవ‌గాహ‌న‌ ఉన్న‌టువంటి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వైకాపాలోకి వ‌స్తే అంత‌క‌న్నా శుభ‌వార్త ఇంకేముంటుంది...ఏమంటారు..?

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.