జ‌గ‌న్ పై టీడీపీ ప్లాన్ ఫెయిల్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-29 03:19:45

జ‌గ‌న్ పై టీడీపీ ప్లాన్ ఫెయిల్

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులను తెలుగుదేశం అణిచివేయాల‌ని ఎన్నో ఎత్తులు వేస్తోంది అనే విమ‌ర్శ‌లు రాష్ట్ర వ్యాప్తంగా వ‌స్తూనే ఉన్నాయి.. ఇక జ‌గ‌న్ పాద‌యాత్ర నెల్లూరు జిల్లాలో వ‌చ్చేస‌రికి ఇక్క‌డ వైసీపీని ఇరుకున పెడ‌దామ‌ని అనుకున్నారు తెలుగుదేశం నాయ‌కులు.. దీనికి ప్ర‌ధాన కార‌ణం వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ గ‌త ఎన్నిక‌ల్లో ఈ జిల్లాలో మెజార్టీ సీట్లు గెలుచుకుంది.. దీంతో తెలుగుదేశం అధికారంలోకి వ‌చ్చినా ఇక్క‌డ వారికి అంత మెజార్టీ లేక‌పోవ‌డం, అలాగే ఫిరాయింపులు చేద్దాము అన్నా, ఒకే ఒక్క ఎమ్మెల్యే పార్టీ మారి తెలుగుదేశం పంచ‌న చేరారు. దీంతో ఇక్క‌డ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా మెజార్టీ సీట్లు తెలుగుదేశం గెలుచుకోవాలి అనే త‌లంపుతో ఉంది.

అయితే జ‌గ‌న్ నెల్లూరు జిల్లాలో పాద‌యాత్ర చేసే స‌మ‌యంలో ఇక్క‌డ పార్టీలో కొంద‌రిని తెలుగుదేశంలోకి చేర్చుకోవాలని ఓ ఎంపీ ఫ్యామిలీకి ఇక్క‌డ గేలం వేసింది.. అయితే ఆయ‌న అపాయింట్ మెంట్ కూడా ఇవ్వ‌క‌పోవ‌డంతో తెలుగుదేశం నాయ‌కులు మ‌రోదారి లేక కిక్కురుమ‌న‌కుండా ఉన్నారు.. ఇక మ‌రో ఎమ్మెల్యేకు అత్య‌ధికంగా కోట్ చేశారు అనే వార్త‌లు వినిపించాయి... అయితే జ‌గ‌న్ పాద‌యాత్ర స‌మ‌యంలో ఆయ‌న కూడా అందుబాటులో లేక‌పోవ‌డంతో సైకిల్ పై వెనుదిరిగారు త‌మ్ముళ్లు.

అలాగే జిల్లాలో సూళ్లూరుపేట ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే కిల్లివేటి సంజీవయ్యను టీడీపీలోకి తీసుకొచ్చేందుకు జిల్లాలో ఎమ్మెల్సీ కం మంత్రి చాలా ప్రయత్నాలే చేశార‌ట‌. . కానీ సంజీవయ్య మాత్రం పార్టీని వీడేందుకు ఇష్టపడలేదు. అలాగే కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై కూడా ఆపరేషన్ ఆక‌ర్ష్ వ‌దిలారు కాని అది కూడా ఫెయిల్ అయింది.

ఇక్క‌డ వైసీపీని ఇరుకున పెడ‌దామంటే ఏకంగా టీడీపీ ఇరుకున ప‌డింది.. సూళ్లూరు పేట‌లో తెలుగుదేశానికి ఎప్ప‌టి నుంచో న‌మ్మ‌కంగా ప‌ట్టుకొమ్మ‌గా ఉన్న ఫ్యామిలీ వేనాటి కుటుంబం, జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో తెలుగుదేశంలో ఇక ఇమ‌డ‌లేక వైసీపీలోకి వ‌చ్చారు. అలాగే ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి కూడా జ‌గ‌న్ చెంత‌కు అనే స‌రికి తెలుగుదేశానికి కాస్త కాక‌పుట్టింది... ఇక్క‌డ జ‌గ‌న్ ను వీక్ చేద్దాము అనుకుంటే తెలుగుదేశం చివ‌ర‌కు వీక్ అయింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.