రోజా ఇంట్లో చోరి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-22 05:38:00

రోజా ఇంట్లో చోరి

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే , సినీ ఆర్కె రోజా ఇంట్లో చోరి జ‌రిగింది. హైద‌రాబాద్ లోని మ‌ణికొండ పంచ‌వ‌టి కాల‌నీలో రోజా ఫ్యామిలీ ఉంటుంది. అయితే గ‌త కొంత కాలంగా ప‌లు కార‌ణాల చేత రోజా ఫ్యామిలీ ఆ ఇంట్లో లేదు. దీంతో ఈ ఇంటికి తాళం వేసింది. 
 
ఇదే అదునుగా భావించిన దుండ‌గులు రోజా ఇంట్లో చోరికి పాల్ప‌డ్డారు. చోరి జ‌రిగిన‌ట్లు మాదాపూర్ పోలీసుల‌కు రోజా ఫిర్యాదు చేయ‌డం జరిగింది. సుమారు రూ.10 ల‌క్ష‌ల విలువైన బంగారు,వెండి, ఆభ‌ర‌ణాలు, చోరికి గుర‌య్యాయిన‌ట్లు రోజా ఫిర్యాదులో పేర్కొన్నారు.  కేసును న‌మోదు చేసుకున్న పోలీసులు  రోజా ఇంటికి చేరుకుని చోరికి గురైన బీరువాను ప‌రిశీలించి విచార‌ణ చేస్తున్నారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.