జ‌గ‌న్ లో కొత్త‌కోణాన్ని చెప్పిన ఉండ‌వ‌ల్లి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-23 03:20:05

జ‌గ‌న్ లో కొత్త‌కోణాన్ని చెప్పిన ఉండ‌వ‌ల్లి

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర నేడు నెల్లూరు జిల్లాలో కొన‌సాగుతోంది... ఆయ‌న  చేప‌ట్టిన ఈ యాత్ర‌కు అడుగ‌డుగునా, ప్ర‌జ‌లు నీరాజ‌నాలుప‌లుకుతున్నారు... ఇప్ప‌టికే రాయ‌ల‌సీమ జిల్లాల్లో  జ‌గ‌న్ త‌న యాత్ర‌ను ముగించుకుని, నెల్లూరు జిల్లాలో అడుగు పెట్టారు... జ‌గ‌న్ త‌మ జిల్లాకి  వ‌స్తున్నాడ‌న్న స‌మాచారం అంద‌డంతో ఆయ‌న‌కు మ‌ద్ద‌తు తెలిపేందుకు జ‌నాలు అధిక సంఖ్య‌లో పాల్గొంటున్నారు.
 
ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ యాత్ర‌కు అనేక మంది మ‌ద్ద‌తు తెల‌ప‌డ‌మే కాకుండా, ప‌లువురు ముఖ్య‌నేత‌లు కుడా ఆయ‌న పై  అనూహ్యంగా వ్యాఖ్య‌లు చేస్తున్నారు... తాజాగా మాజీ ఎంపీ  ఉండ‌వ‌ల్లి అరుణ్  కుమార్ నేడు జ‌గ‌న్ పై కొన్ని ఆస‌క్తిరమైన వ్యాఖ్య‌లు చేశారు...దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఏదైనా ప్ర‌జ‌ల‌కు ఒక మాట ఇస్తే... ఆ మాట‌కు క‌ట్టుబ‌డి ఉంటార‌ని... అయితే అలాంటి పోలిక‌లే ఆయ‌న కుమారుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి వ‌చ్చాయ‌ని ఉండ‌వ‌ల్లి మీడియా ద్వారా తెలిపారు.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి చంద్ర‌బాబు నాయుడికి పూర్తి వ్య‌త్యాసం ఉంద‌ని అన్నారు.
 
ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు బీజేపీతో పొత్తు పెట్టుకుని కూడా విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న  విశాఖ రైల్వేజోన్, ప్ర‌త్యేహోదా పై ప్ర‌శ్నించ‌డం లేద‌ని  చంద్ర‌బాబు పై ఉండ‌వ‌ల్లి మండిప‌డ్డారు.. ప్ర‌జ‌ల‌కు ప్ర‌త్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ పై ఉన్న అభిమ‌తాన్ని చెడ‌గొట్టేందుకు బాబు య‌త్నిస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు..
 
అయితే జ‌గ‌న్ పాద‌యాత్ర ప్రారంభించినప్ప‌టి నుంచి, ప్ర‌జ‌లు అధిక సంఖ్య‌లో ఆయ‌న‌కు మ‌ద్ద‌తు తెలుపుతున్నార‌ని అన్నారు...  వ‌చ్చే ఎన్నిక‌ల‌లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి ప‌ద‌వి చేప‌ట్టేందుకు పూర్తిగా అర్హుడ‌ని ఉండ‌వ‌ల్లి స్ప‌ష్టం చేశారు..

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.