వైసీపీలోకి ప్రముఖ పారిశ్రామికవేత్త

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-27 11:04:46

వైసీపీలోకి ప్రముఖ పారిశ్రామికవేత్త

జ‌న‌నేత, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్మోహన్ రెడ్డి పాద‌యాత్ర ప్ర‌స్తుతం నెల్లూరు జిల్లాలో కొన‌సాగుతోంది.. రాయ‌ల‌సీమ ప్రాంతం నుంచి పాద‌యాత్ర నెల్లూరు జిల్లాలో ప్ర‌వేశించిన త‌ర్వాత వైయ‌స్ జ‌గ‌న్ కు కోస్తాలో ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు.. వైసీపీ నాయ‌కులు ప్ర‌స్తుతం వైయ‌స్ జ‌గ‌న్ తో నెల్లూరు జిల్లాలో పాద‌యాత్ర‌లో పాల్గొంటున్నారు.

నెల్లూరు జిల్లాలో జ‌గ‌న్ పాద‌యాత్ర మొద‌లు పెట్టిన స‌మ‌యం నుంచి పార్టీకి పెద్ద ఎత్తున యువ‌త మ‌ద్ద‌తు తెలుపుతున్నారు.. జ‌గ‌న్ పార్టీలోకి చేరేందుకు పెద్ద ఎత్తున నాయ‌కులు రెడీ అవుతున్నారు.. జిల్లా టీడీపీలో వేనాటి కుటుంబం తాజాగా టీడీపీకి దూరం అవుతున్న‌ట్లు, రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.. వేనాటి సుమంత్ రెడ్డి తెలుగుదేశానికి రాజీనామా చేసి జ‌గ‌న్ తో క‌లిసి పాద‌యాత్ర‌లో పాల్గొన్నారు.. ఇక పార్టీలో రేపు చేరేందుకు రెడీ అవుతున్నారు ఆయ‌న‌.

ఇక జిల్లాలో ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. రేపు జగన్‌ పాదయాత్రలో వేమిరెడ్డి పాల్గొననున్నారు. వేమిరెడ్డితో పాటు కాంగ్రెస్‌ నేత కేతంరెడ్డి వినోద్‌రెడ్డి వైసీపీలో చేరనున్నారు..

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.