జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో టీడీపీ వికెట్ డౌన్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-25 02:13:02

జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో టీడీపీ వికెట్ డౌన్

వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన పాద‌యాత్ర రాయ‌ల‌సీమ జిల్లాల నుంచి ఇటు నెల్లూరు జిల్లాలోకి ప్ర‌వేశించింది... జ‌గ‌న్ కు నెల్లూరు జిల్లా నాయ‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు.. అడుగ‌డుగునా జ‌గ‌న్ కు జేజేలు  ప‌లుకుతూ క‌దం తోక్కుతున్నారు జిల్లా వైసీపీ నాయ‌కులు.
 
ఇటు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్   చేయ‌డానికి కూడా అధికార పార్టీ స‌న్నాహాలుచేస్తోంది... అయినా జ‌గ‌న్ ప‌ట్టువీడ‌ని విక్ర‌మార్కుడిలా ముందుకు సాగుతున్నారు.. జ‌గ‌న్ కోస్తాలో పాద‌యాత్ర స్టార్ట్ చేయ‌గానే, ఆయ‌న వెంట ప‌లువురు న‌డుస్తున్నారు.. జ‌గ‌న్ పాద‌యాత్రతో  కోస్తాలో  తెలుగుదేశానికి ఓ ఎదురుదెబ్బ త‌గిలేలా క‌నిపిస్తోంది.
 
సుళ్లూరుపేటలో వేనాటి వంశం వారసుడు జగన్ పార్టీలోకి జంప్ అవుతున్నారు అనే  వార్త‌లు జిల్లాలో తాజాగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే జగన్‌ని ఆయ‌న కలవడమే కాకుండా, మా నాన్నతో చర్చించిన తర్వాత పార్టీలో చేర‌తాను అని  వేనాటి సుమంత్ చెప్పడం, సుళ్లూరుపేట తెలుగుదేశంలో కాస్త అల‌జ‌డి రేగింది.... నెల్లూరు అంటేనే కాంగ్రెస్ కంచుకోట‌గా ఉండే జిల్లా, త‌ర్వాత వైసీపీ ఇక్క‌డ ఆమేర విజ‌యాలు సాధించింది. అయితే తాజాగా టీడీపీ అధికారంలో ఉన్నా  జిల్లాలో మాత్రం వైసీపీకి గ‌ట్టి కేడ‌ర్ ఉంది.
 
నెల్లూరు జిల్లాలో వేనాటి మునిరెడ్డి, ఆయన తర్వాత వేనాటి రామచంద్రారెడ్డి  టీడీపీకి భరోసా ఇస్తూ వచ్చారు. ...
టీడీపీలో ఎన్ని సంవ‌త్స‌రాలు ఉన్నా, వారికి ప‌ద‌వులు లేవు.. దీంతో పార్టీలో ఇమ‌డ‌లేక వైసీపీలోకి వార‌సులు వ‌స్తున్నారు అనే వార్త‌లు గ‌త కొన్ని నెల‌లుగా వినిపిస్తున్నాయి.. అయితే జ‌గ‌న్ పాద‌యాత్ర‌తో వారు తెలుగుదేశానికి క‌టీఫ్ చెప్ప‌నున్నారు అని తెలుస్తోంది.  ముందుగా వీరి వార‌సుడిని పార్టీలోకి పంపుతున్నారు అని జిల్లాలో వార్త‌లు వినిపిస్తున్నాయి. జ‌గ‌న్ న‌వ‌ర‌త్న ప‌థ‌కాలు న‌చ్చి వైసీపీలోకి వెళుతున్నారు అనే వార్త‌లు కుటుంబీకుల నుంచి వ‌స్తున్నాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.