బ్రేకింగ్.. వైసీపీ నేత‌లు అరెస్ట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-25 12:09:45

బ్రేకింగ్.. వైసీపీ నేత‌లు అరెస్ట్

ప్ర‌తిప‌క్ష వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు ప్ర‌జా స‌మ‌స్య‌లపై  ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తూ ప‌రిష్కారం కోసం  పోరాటం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో అనేమార్లు అక్ర‌మ అరెస్ట్ లు, గృహ‌నిర్భంధం చేస్తూ పోలీసులు వారి హ‌క్కుల‌ను కాల‌రాస్తున్నారు. 
 
క‌డ‌ప‌లో ఉక్కు ఫ్యాక్ట‌రినీ ఏర్పాటు చేయాల‌ని  గ‌త కొన్నేళ్లుగా రాయ‌ల‌సీమ ప్ర‌జ‌లు కోరుతూనే ఉన్నారు. ఈ విష‌యంపై గురువారం నాడు వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌తో పాటు వామ‌ప‌క్ష పార్టీలు,ప‌లు ప్ర‌జాసంఘాలు  క‌లిసి బంద్ ను చేప‌ట్టారు.  జిల్లా వ్యాప్తంగా  క‌డప ఉక్కు-రాయ‌ల‌సీమ హ‌క్కు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ త‌మ గ‌ళాన్ని ప్ర‌భుత్వానికి వినిపించారు. 
 
బంద్ లో భాగంగా వైసీపీ నేత‌లు క‌డ‌ప బ‌స్ స్టాండ్ ద‌గ్గ‌ర ఆందోళ‌న‌కు దిగి బ‌స్సుల రాక‌పోక‌ల‌ను అడ్డుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు క‌డ‌ప పార్ల‌మెంట్ అధ్య‌క్షులు, మేయ‌ర్ సురేష్ బాబు, ఎమ్మెల్యే అంజ‌ద్ భాష, ఆర్సీపీ అధ్య‌క్షుడు ర‌విశంక‌ర్ రెడ్డిల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
మ‌రోవైపు రాజంపేట బ‌స్టాండ్ ముందు బైఠాయించిన వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఆకేపాటి అమ‌ర్ నాథ రెడ్డితో పాటు సీపిఐ, సీపిఎం నేత‌ల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాయ‌చోటిలో  వైసీపీ నేత మ‌ద‌న్ మోన్ రెడ్డిని పోలీసులు  అరెస్ట్ చేశారు. దీంతో క‌డ‌ప‌లో ఉద్రిక్త‌త ప‌రిస్ధితులు నెల‌కొన్నాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.