ఆనం పై ఎమ్మెల్యే రోజా కేసు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-03 10:29:53

ఆనం పై ఎమ్మెల్యే రోజా కేసు

న‌గ‌రి ఎమ్మెల్యే....వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజాపై తెలుగుదేశం నాయ‌కులు చేసే కామెంట్లు అనుచిత వ్యాఖ్య‌లు తెలిసిందే ...అయితే తాజాగా ఆమె పై నాయ‌కుల కామెంట్లు త‌గ్గాయి కాని..?  గ‌తంలో ఆమె పై  కామెంట్లు చేసిన ఓ తెలుగుదేశం నాయ‌కుడికి మాత్రం తాజాగా  కోర్టులో ఎదురుదెబ్బ త‌గిలింది.
 
ఎప్పుడూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు, వెరైటీ చేష్ట‌లు, ప‌నుల‌తో వార్త‌ల్లో ఉంటారు నెల్లూరు నాయ‌కుడు ఆనం వివేకానంద‌రెడ్డి... గ‌తంలో వైసీపీ నాయ‌కుల‌కు విమ‌ర్శించే పనిలో, వైసీపీని నీరుగార్చే క‌ర్త‌వ్యంలో తెలుగుదేశం త‌ర‌పున ఆనం ప‌రుష వ్యాఖ్య‌ల‌తో త‌న దురుసును చూపేవారు ... ఆ స‌మ‌యంలో వివేకా వైసీపీ ఎమ్మెల్యే రోజా పై ప‌లు దూష‌ణ‌లు అనుచిత వ్యాఖ్య‌లు చేశారు.
 
దీనిపై ఆమె ఆనంపై కోర్టుకు వెళ్లారు త‌న పై ప‌లు విష‌యాల్లో దూష‌ణ‌లు చేశార‌ని, త‌న ప‌రువుకు భంగం క‌లిగించార‌ని ఆనం పై కోర్టుకెళ్లారు ఎమ్మెల్యే రోజా.. అత‌నిపై డిఫ‌మేష‌న్ కేసు వేశారు...  దీన్ని సీరియస్‌‌గా తీసుకున్న ఎర్రమంజిల్ కోర్టు... తాజాగా  ఆనంకు షాకిచ్చింది.....రోజా వేసిన కేసుతో ఆనంకు అరెస్ట్ వారెంట్‌ జారీచేసింది న్యాయ‌స్ధానం.
 
గ‌తంలో ఎమ్మెల్యే అనిత‌, మాజీ మంత్రి పీతల సుజాత ప‌లువురు తెలుగుదేశం నాయ‌కులు ఎమ్మెల్యే రోజాపై ప‌లుదూష‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే, అయితే ఏడాది పాటు ఆమెను తెలుగుదేశం స‌స్పెండ్ కూడా చేసింది అసెంబ్లీకి రాకుండా...  ఆమె వేసిన కేసుతో ఆనం ఎటువంటి సంజాయిషీ ఇస్తారో ఎలా ముందుకు వెళ‌తారో చూడాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.