రాజ్య‌స‌భ‌లో ప్ర‌స్తావిస్తా....

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-23 05:48:14

రాజ్య‌స‌భ‌లో ప్ర‌స్తావిస్తా....

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో గ‌త 20 రోజులుగా మ‌త్స్య‌కారులు దీక్ష‌లు చేస్తూనే ఉన్నారు. మ‌త్స్య‌కారుల‌ను ఎస్టీ జామాతాలో చేర్చుతామంటూ చంద్రబాబు నాయుడు  గ‌త ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చాల‌ని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవ‌ల ఈ విష‌యంపై మ‌త్స్య‌కారులు బాబును క‌లువ‌గా ఆయ‌న వారిపై సీరియ‌స్ అయిన‌ట్లు కూడా వార్త‌లు వ‌చ్చాయి. 
 
ఎస్టీలో చేర్చాని కోరుతూ దీఓలు చేస్తున్న మ‌త్స్య‌కారుల‌కు వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు సంఘీభావం ప్ర‌క‌టించారు. ప్ర‌భుత్వం ఎన్నిక వేళ ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చాల‌ని విజ‌య‌సాయి రెడ్డి డిమాండ్ చేశారు. మ‌త్స్య‌కారుల‌ను మోసం చేస్తే రానున్న ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా  త‌గిన గుణ‌పాఠం తప్ప‌ద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. 
 
మ‌త్స్య‌కారుల‌ను ఎస్టీలుగా గుర్తించే విష‌యంపై పార్ల‌మెంట్ స‌మావేశాల్లో ప్ర‌స్తావిస్తాన‌ని విజ‌య‌సాయి రెడ్డి హామీ ఇవ్వ‌డం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో  సీనియర్‌ నేత ధర్మాన ప్రసాదరావులు, సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు  పాల్గొన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.