జ‌గ‌న్ ఫ‌స్ట్ రికార్డ్ టార్గెట్ @2000

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-29 05:17:42

జ‌గ‌న్ ఫ‌స్ట్ రికార్డ్ టార్గెట్ @2000

వాక్ విత్ జ‌గ‌న్ అనే నినాదం తెలుగు రాష్ట్రాల‌లో మార్మోగింది.. వైసీపీ అధినేత ఏపీ ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర 1000 కిలోమీట‌ర్లు అధిగ‌మిస్తున్న సంద‌ర్బంగా, వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేర‌కు పార్టీ నాయ‌కులు అంద‌రూ జ‌గ‌న్ కు స‌పోర్ట్ గా పాద‌యాత్ర‌లో ముందుకు క‌దిలారు.

తాజాగా జ‌గ‌న్ పాద‌యాత్ర నెల్లూరు జిల్లాలో 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. మూడువేల కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని ఆయన వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం వద్ద దాటారు... ఈ సందర్భంగా కార్యకర్తలు, గ్రామస్థులు వైఎస్‌ జగన్‌కు ఘన స్వాగతం పలికారు. పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన సైదాపురంలో పైలాన్‌ను ఆవిష్కరించారు.

ఇక జ‌గన్ కు మ‌ద్ద‌తుగా పార్టీలో నాయ‌కులు మ‌రింత ముందుకు న‌డిచారు.. అన్ని జిల్లాల్లో ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా వాక్ విత్ జ‌గ‌న్ కార్య‌క్రమాన్ని చేప‌ట్టారు.. ముఖ్యంగా యువ‌త మరింత ఎక్కువ సంఖ్య‌లో జ‌గ‌న్ కు స‌పోర్ట్ గా నిలిచారు.. ఇక 3000 కిలోమీట‌ర్ల సుదీర్ఘ పాద‌యాత్ర‌లో మ‌న రెండో టార్గెట్, 2000 కిలోమీట‌ర్లు అంటూ సోష‌ల్ మీడియాలో జ‌గ‌న్ కు స‌పోర్ట్ గా పోస్టులు వైర‌ల్ అవుతున్నాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.