జ‌గ‌న్ కొత్త నినాదం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-29 03:45:04

జ‌గ‌న్ కొత్త నినాదం

తెలుగుదేశం అంటే హామీలు ఇవ్వ‌డం, ఆ హామీలు నెర‌వేర్చ‌క‌పోవడం, అడిగితే అన్ని తీర్చుతున్నాం అన‌డం, అనేది ప్ర‌జ‌ల‌కు అంద‌రికీ తెలిసిపోయిన వాస్త‌వం.. 2014 ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల్లో మేజ‌ర్ హామీలు ఏ ఒక్క‌టీ కూడా నెర‌వేర్చ‌లేదు.. దీనిపై ప్ర‌శ్నిస్తే తిరిగి అవి పూర్తి చేశాము అనే స‌మాధానాలు వ‌స్తున్నాయి తెలుగుదేశం నుంచి. దీంతో ప్ర‌జ‌లు కూడా తెలుగుదేశాన్ని ప్ర‌శ్నించ‌డం లేదు.

గ‌త ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీలు ఏమీటో కూడా తెలుగుదేశం నాయ‌కులు మ‌రిచిపోయారు.. దీనిపై కొంద‌రు నాయ‌కులు ప‌లు డిబేట్ల‌లో కూడా ఎటువంటి క్లారిటీ ఇవ్వ‌డం లేదు.. అయితే ప్రతీ ఇంటికో ఉద్యోగం అన్నారు, అస‌లు స‌ర్కారు కొలువు విష‌యం ప‌క్క‌న పెడితే? ప్రైవేట్ ఉద్యోగం కూడా దిక్కులేదు. దీనిపై ప్ర‌శ్నించే యువ‌త‌ను కూడా ప‌క్క‌కు నెట్టుతున్నారు నాయ‌కులు. దీంతో యువ‌త కూడా తెలుగుదేశం ప‌ద్ద‌తి పై విమ‌ర్శలు చేస్తున్నారు.

జ‌గ‌న్ సోష‌ల్ మీడియా ద్వారా మ‌రింత ఆద‌ర‌ణ పొందుతున్నారు.. అస‌లు ప్ర‌త్యేక హోదా అంశాన్ని ప‌క్క‌న పెట్టిన కేంద్రం - తెలుగుదేశం స‌ర్కారుల‌ను జ‌గ‌న్ మ‌రింత ప్ర‌శ్నిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో పాద‌యాత్ర‌లో ఉన్న జ‌గ‌న్ ఎక్కువ‌గా ఫోక‌స్ చేస్తున్న అంశం నిరుద్యోగ భృతి... ఈ పిలుపును ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళుతున్నారు జ‌గ‌న్.. ఇందులో ఆయ‌న స‌క్సెస్ అయ్యారు అనే చెప్ప‌వ‌చ్చు.

చంద్రబాబు ఎన్నికల ముందు ప్రతీ ఇంటికి ఒక లేఖ పంపారని, అందులో ఉపాధి కల్పిస్తాం, ఉద్యోగం కల్పిస్తాం రెండు ఇవ్వలేకపోతే ఇంటికి రెండువేలరూపాయలు నెలకు నిరుద్యోగ భృతి ఇస్తామంటూ వాగ్దానం లిఖిత‌ పూర్వకంగా ఇచ్చిన అంశం ప్రస్తావిస్తున్నారు జ‌గ‌న్... చంద్రబాబు అధికారంలోకి వచ్చి 45 నెలలు అయిందని ఆయన చెప్పిన లెక్క ప్రకారం 90 వేలరూపాయలు ప్రతీ ఇంటికి బాకీ పడ్డారని లెక్క కట్టారు విపక్ష నేత వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.

ఇప్ప‌డు ఆబాకీ తీర్చ‌కుండా మ‌ళ్లీ ఎన్నిక‌ల్లో నిరుద్యోగ భృతి అంటారు చూడండి అని జ‌గ‌న్ గుర్తుచేస్తున్నారు.. దీంతో యువత‌లో పెద్ద ఎద్దున దీనిపై వ్య‌తిరేక‌త వ‌స్తోంది... బాబు పోవాలి జాబు రావాలి అనే స్లోగ‌న్ యువ‌త‌కు మ‌రింత ద‌గ్గ‌ర అవుతోంది అనేది తాజాగా తెలుస్తోంది.. అయితే కంపెనీలు తీసుకురావ‌డానికి నాలుగు సంవత్స‌రాలుగా క‌ష్ట‌ప‌డుతున్నారు అనే మాటలు కూడా, చాలా హాస్యాస్పదంగా ఉన్నాయ‌ని అంటున్నారు జ‌గ‌న్.

అయితే జ‌గ‌న్ తీసుకున్న‌స్టాండ్ పై వైసీపీ నాయ‌కులు హుషారుగా ఉంటే, ఇటు తెలుగుదేశం నాయ‌కులు సైలెంట్ గా ఉన్నారు..నిరుద్యోగ భృతి త‌మ పార్టీ ప్ర‌క‌ట‌న చేసింది... వ‌స్తుంది అని అంటున్నారు. అయితే ఎన్నిక‌ల‌కు ఆరు నెల‌ల ముందు ఇస్తే పార్టీకి మ‌రింత ప్లస్ అని తెలుగుదేశం భావిస్తోంద‌ని, వైసీపీ నాయ‌కులు -మేధావులు - రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.