వేడుక‌లు ఎక్క‌డ జ‌రిపారో తెలుసా...

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-26 12:43:42

వేడుక‌లు ఎక్క‌డ జ‌రిపారో తెలుసా...

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుకల‌ను ఘ‌నంగా జ‌రుపుకున్నారు. నెల్లూరు జిల్లా ఓజిలి మండ‌లం స‌గుటూరులో జ‌రిగిన గ‌ణ‌తంత్ర వేడుక‌లో పాల్గొన్న వైయ‌స్ జ‌గ‌న్ జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించి, జెండా వంద‌నం చేశారు.

మ‌హాత్మాగాంధీ చిత్ర‌ప‌టానికి పూల మాల‌లు వేసి నివాళులు అర్పించిన అనంత‌రం పోలీసుల గౌర‌వ వంద‌నం స్వీక‌రించారు వైయ‌స్ జ‌గ‌న్. తెలుగు రాష్ట్ర ప్ర‌జ‌ల‌తో పాటు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న భార‌తీయులంద‌రికీ జ‌గ‌న్ గ‌ణ‌తంత్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు.

వేడుక‌లో మాట్లాడూతూ.... భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని, చట్టబద్ధ పాలనను నిలబెట్టడంతోపాటు పౌరహక్కులను పరిరక్షించ‌డంలో సామాజిక న్యాయాన్ని అందించడంలో రాజ్యాంగం మహోన్నత పాత్ర పోషించిందని, ఒక రక్షణ కవచంగా నిలిచిందని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.