ప‌వ‌న్ తిక్కకు లెక్క చెప్పిన జ‌గ‌న్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-01 10:58:24

ప‌వ‌న్ తిక్కకు లెక్క చెప్పిన జ‌గ‌న్

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్ర‌లో భాగంగా ప్ర‌ముఖ తెలుగు  న్యూస్ చాన‌ల్ ఎన్టీవీకి ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. రాష్ట్ర రాజ‌కీయ ప‌రిస్ధితుల‌పై సుధీర్ఘంగా మాట్లాడిన  వైయ‌స్ జ‌గ‌న్ త‌న‌దైన శైలిలో జ‌న‌సేన పార్టీపై కౌంట‌ర్లు వేశారు. 
 
జ‌న‌సేన పార్టీ  వ‌ల‌న త‌మ పార్టీకి  కొత్త‌గా  ఎలాంటి న‌ష్టం క‌లుగ‌ద‌ని  జ‌గ‌న్ అన్నారు. ఓట్లు వేయించేవాడు దేవుడు..... ఓట్లు వేసేది ప్ర‌జ‌లు.... ఎవ‌రి వ‌ల్ల మేలు జ‌రుగుతుంద‌ని అనుకుంటారో వారికే ప్ర‌జ‌లు  ఓట్లు వేస్తారు. జ‌న‌సేన లాస్ట్ టైం కూడా టీడీపీకే మ‌ద్ద‌తు ఇచ్చింది.
 
ప‌వ‌న్ క‌ళ్యాణ్  ను అభిమానించే ప్ర‌తి ఒక్క‌రూ తెలుగుదేశం పార్టీకే ఓట్లు వేశారు. ఆయ‌న ఊరూరు తిరిగి టీడీపీకి ఓట్లు వేయ‌మ‌ని అడిగారు.  మ‌రి ఇప్పుడు ఏ విధంగా వైసీపీకి న‌ష్టం క‌ల్పించ‌గ‌ల‌డు........ ఇప్పుడు కూడా అదే ఓటు బ్యాంకే క‌దా అని అభిప్రాయ‌ప‌డ్డారు. 
 
టీడీపీకి జన‌సేన మ‌ద్ద‌తు ఇస్తే గ‌తంలో వారికి ప‌డిన ఓట్లే ఇప్పుడు ప‌డ‌తాయి... అంతేకాని కొత్త‌గా ఏమీ ఓట్లు ప‌డ‌వు క‌దా అని జ‌గ‌న్ అన్నారు. గ‌తంలో ఇచ్చిన హామీల్లో  ఏ ఒక్క‌టి కూడా పూర్తి స్ధాయిలో నెర‌వేర్చ‌లేదు అలాంట‌పుడు అవే ఓట్లు ఇప్పుడు వారికి ప‌డ‌తాయ‌ని న‌మ్మ‌క‌మేంట‌నేది జ‌గ‌న్ వాద‌న‌. 
 
సో ... ప్ర‌భుత్వం పై వ‌స్తున్న వ్య‌తిరేక‌త కార‌ణంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో  ప‌వ‌న్ ఫ్యాన్స్ కూడా వైసీపీకి ఓటు వేసే అవ‌కాశాలు ఉన్నాయి. ఇందుకు  ఇటీవ‌ల వెల‌సిన ఓ ఫ్లేక్సీనే ఉదాహ‌ర‌ణగా చెప్పుకోవ‌చ్చు...ప‌వ‌ర్‌ స్టార్ ను అభిమానిస్తాం...జ‌గ‌న్ కు ఓటేస్తాం అంటూ  ఫ్లేక్సీలు ఏర్పాటు చేశారు.  అయినా జ‌న‌సేన పార్టీని అభిమానించే యువ‌త‌లో  స‌గానికి స‌గం పైగా ఓటు హ‌క్కు లేని వారు ఉంటారేమో అంటూ స‌టైర్లు వేసుకుంటున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.