సీట్ల పెంపుపై పార్టీ నేత‌ల‌కు ధైర్యం చెప్పిన జ‌గ‌న్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-27 01:17:58

సీట్ల పెంపుపై పార్టీ నేత‌ల‌కు ధైర్యం చెప్పిన జ‌గ‌న్

విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న అంశాల్లో నియోజ‌క‌వర్గాల పునర్విభ‌జ‌న పెంపుపై ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. రానున్న పార్ల‌మెంట్ స‌మావేశాల్లో సీట్ల పెంపు విష‌యంపై క్లారిటీ రానుంద‌ని, ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వం కార్య‌చ‌ర‌ణ కూడా కొసాగిస్తోంద‌నే వార్త ఇప్పుడు చ‌క్క‌ర్లు కొడుతోంది.

కొంద‌రు సీట్ల పెంపు ఖ‌చ్చితంగా జ‌రగ‌నుంద‌ని, మ‌రికొంద‌రు జ‌ర‌గ‌డం అసాధ్యమ‌ని అంటున్నారు. పెంపు కోసం అవ‌స‌ర‌మైతే చ‌ట్ట‌స‌వ‌రణ జ‌రిపే దిశ‌గా పావులు క‌దుపుతున్నార‌ని కూడా వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఈ విష‌యంపై పార్టీ నేత‌లతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడిన‌ట్లు ఓ ప‌త్రిక‌లో క‌థ‌నం వ‌చ్చింది.

ఢిల్లీ నుండి అందుతున్న స‌మాచారం ప్ర‌కారం నియోజ‌క‌వ‌ర్గాల పెంపు జ‌రిగే అవ‌కాశం లేద‌ని వైయ‌స్ జ‌గ‌న్ పార్టీ నేత‌ల‌కు చెప్పార‌ట‌. విభ‌జ‌న చ‌ట్టంలోని మిగ‌తా అంశాల‌ను నెర‌వేర్చ‌న‌పుడు కేవ‌లం అసెంబ్లీ సీట్ల పెంపుకు కాంగ్రెస్ పార్టీ అంగీక‌రించే అవ‌కాశం లేద‌ని పార్టీ నేత‌ల‌కు వైయ‌స్ జ‌గ‌న్ దైర్యం చెప్పిన‌ట్లు క‌థ‌నం ప్ర‌చుర‌ణ అయింది.

ఇక‌, లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్‌ లేదా నవంబర్‌లో జ‌రిగే అవకాశం ఉందని.. కావున అందుకు తగ్గట్టుగా పార్టీ నేతలు, కార్య‌క‌ర్త‌లు సిద్ధం కావాలని వైయ‌స్ జగన్ పిలుపునిచ్చిన‌ట్లు సదరు ప‌త్రిక వెల్ల‌డించింది.

షేర్ :

Comments

1 Comment

  1. guest test post [url=http://temresults2018.com/]bbcode[/url] html http://temresults2018.com/ simple

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.