వైయ‌స్ జ‌గ‌న్ మ‌రో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-31 07:01:03

వైయ‌స్ జ‌గ‌న్ మ‌రో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్ర నెల్లూరు జిల్లా స‌ర్వేప‌ల్లి నియోక‌వ‌ర్గానికి చేరుకుంది. స‌ర్వేపల్లి నియోజ‌క‌వ‌ర్గం పాద‌ల‌కూరులో  ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో వైయ‌స్ జ‌గ‌న్ త‌న‌దైన శైలిలో  ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగం ఇచ్చారు. 
 
రాష్ట్రంలో యువ‌త  నిరుద్యోగంతో  అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసిన వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.......  రానున్న రోజుల్లో ప‌రిశ్ర‌మ‌లు ఏవైతే వ‌స్తాయో..... ఇప్ప‌టి వ‌ర‌కు ప‌రిశ్ర‌మ‌లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి కూడా మ‌న ప్ర‌భుత్వం వ‌చ్చాక మొట్ట‌మొద‌టి శాస‌న‌స‌భ‌లో  ఓ తీర్మానం చేస్తామంటూ వైయస్ జ‌గ‌న్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. 
 
ఉన్న ప‌రిశ్ర‌మ‌కు నోటీసులు పంపిస్తాం...ఏర్పాటు చేయ‌నున్న  ప‌రిశ్ర‌మ‌ల‌కు ఇది అమ‌లు  చేసేలా చేస్తాం...అదేంటంటే.... డెబ్బై ఐదు శాతం లోకల్ వారికే ఉద్యోగాలు ఇచ్చేట్టుగా తీర్మాణం  చేస్తామ‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. 
 
ఉద్యోగాల విప్ల‌వం తీసుకువ‌స్తామ‌ని రిప‌బ్లిక్ నాడే వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న చేశారు. అయితే వైసీపీ అధికారంలోకి రాగానే జ‌ర‌గ‌బోయే మొద‌టి శాస‌న‌స‌భ‌లోనే ఈ తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టి కొత్త చ‌ట్టం తీసుకువ‌స్తామ‌ని జ‌గ‌న్ బుధ‌వారం నాడు  ప్ర‌క‌టించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.