అందుకే సీటు ఇవ్వలేను

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-04 05:41:29

అందుకే సీటు ఇవ్వలేను

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్ర ప్ర‌స్తుతం నెల్లూరు జిల్లాలో కొన‌సాగుతోంది. పాద‌యాత్ర‌లో భాగంగా దేవరపాలెంలో ఆర్యవైశ్యులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు వైయ‌స్ జ‌గ‌న్. ఈ స‌మావేశంలో వైయ‌స్ జ‌గ‌న్ ఆర్య‌వైశ్యుల‌తో మాట్లాడిన ఆయ‌న వారి నుండి స‌ల‌హాలు, సూచ‌న‌లు కూడా తీసుకున్నారు. 
 
ఈ క్ర‌మంలో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో  12 శాతం ఉన్న త‌మ‌కు క‌నీసం జిల్లాకు ఒక‌ ఎమ్మెల్యే సీటు కేటాయించాల‌ని  సూర్య నారాయ‌ణ అనే  ఓ ఆర్య‌వైశ్యుడు, జ‌గ‌న్ ను  కోరారు. దీంతో పాటు నెల్లూరు నుండి ఆర్య‌వైశ్య వైసీపీ నేత ద్వార‌కానాథ్ కు  నెల్లూరు అర్భ‌న్  సీటు కేటాయించాల‌ని  కూడా ఆయ‌న జ‌గ‌న్ నుకోరారు. 
 
ఇందుకు జ‌గ‌న్ స‌మాధాన‌మిస్తూ.... ద్వార‌క అన్న నా మ‌న‌సులో ఉన్నాడు....కాని ఇక్క‌డ అనిల్ కుమార్ యాద‌వ్ ఉన్నాడు..మ‌న పిల్లోడే... కొద్దిగ ఓపిక ప‌ట్టండి.... ఆ మూడు అక్ష‌రాలు ఎమ్మెల్యేగా అయిన ఇవ్వొచ్చు... ఎమ్మెల్సీగా అయిన ఇవ్వ‌వ‌చ్చు...ఇంకా చాలా చాలా చెయ్యొచ్చు...అన్ని ర‌కాలుగా ద్వార‌క అన్న  నా మ‌న‌సులో ఉన్నాడు... త‌ప్ప‌కుండా న్యాయం చేస్తాన‌ని వైయ‌స్ జ‌గ‌న్ ఆర్య‌వైశ్యుల‌కు హామీ ఇచ్చారు. 
 
వైకాపా అధికారంలోకి వచ్చాక ఆర్యవైశ్యుల కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని, ఆర్యవైశ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నవంబర్‌ 1వ తేదీని పొట్టి శ్రీరాములు గౌరవార్థం రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహిస్తామని వైయ‌స్ జ‌గ‌న్  ప్ర‌క‌టించారు.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.