రాధ విష‌యంలో జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-03 01:24:11

రాధ విష‌యంలో జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం

వంగ‌వీటి రంగా పై అనుచిత వ్యాఖ్య‌లు చేసి పార్టీ నుంచి స‌స్పెండ్ అయ్యారు వైసీపీ నాయ‌కుడు గౌత‌మ్ రెడ్డి.. ఇక రాజ‌కీయ భ‌విత‌వ్వం ఏమిటా అని ఆయ‌న డైల‌మాలో ఉన్నారు.. అయితే పార్టీ త‌ర‌పున చేసిన వ్యాఖ్య‌లు కాద‌ని త‌న వ్య‌క్తిగ‌త వ్యాఖ్య‌లు అని గౌతమ్ రెడ్డి త‌న పందాలో వ్యాఖ్య‌లు చేశారు.. రాష్ట్ర వ్యాప్తంగా ఇది పెద్ద వివాదం అయింది, కాపులు గౌతమ్ రెడ్డి పై ఫైర్ అయ్యారు... రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌లు తెలిపారు, రంగా పై వ్యాఖ్య‌ల‌తో  రోడ్డుపైకి వ‌చ్చింది వంగ‌వీటి కుటుంబం. అయితే జ‌గన్ దీనికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా గౌతమ్  రెడ్డిని పార్టీ నుంచి స‌స్పెండ్ చేశారు.
 
గౌత‌మ్ రెడ్డి పార్టీ నుంచి సస్పెండ్ అయినా, ఎందుకు పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు అని విమ‌ర్శ‌లు చేశారు కాపులు, రంగా ఫ్యామిలీ... అయితే రాధ ఈ వ్యవ‌హారంలో జ‌గ‌న్ తో భేటీ అయ్యి పార్టీలో జ‌రుగుతున్న విధానం గురించి చ‌ర్చించారు.
 
ఇక రాధాని తెలుగుదేశంలోకి చేర్చుకోవ‌డానికి ఈలోపు తెలుగుదేశం పావులు క‌దుపుతోంది, అయితే రాధా మాత్రం వైసీపీని వీడేది లేద‌ని త‌న తండ్రి చావుకు కార‌ణం అయిన పార్టీలోకి తాను వెళ్లేది లేద‌ని  స‌న్నిహితుల వ‌ద్ద అంటున్నారు... అయితే ఇటు బంధువు అయిన గౌతం రెడ్డి పై జ‌గ‌న్ వేటు వేసినా ఎందుకు పార్టీలో చురుగ్గా ఉంటున్నారు అనేది పార్టీ సీనియ‌ర్లకు మాత్ర‌మే తెలిసిన అంత‌రంగీక విష‌యం, కాని తాజాగా జ‌గ‌న్ రాధాకు క్లారిటీ ఇచ్చారు అని తెలుస్తోంది. జ‌గ‌న్ సెంట్ర‌ల్ టికెట్ రాధాకు క‌న్పామ్ చేశారు. 
 
వ‌చ్చే ఎన్నికల్లో సీటు నీకే అక్క‌డ పార్టీ కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా ఉండాలి అని జ‌గ‌న్ హామీ ఇచ్చారు రాధాకి... అయితే ఇటు గౌతమ్ రెడ్డి పై వేటు వేసినా పార్టీలో ఇంకా ఎందుకు కొన‌సాగుతున్నారు అనేదానికి మ‌రో రెండు రోజుల్లో స‌మాధానం రానుంది అని హైకమాండ్ చెబుతోంది.. ఇటు జ‌న‌సేన లేదా బీజేపీలోకి వెళ్లే ఆలోచ‌న‌లో గౌతమ్  రెడ్డి ఉన్నారు అంటున్నారు ఆయ‌న అనుచ‌రులు, మొత్తానికి జ‌గ‌న్ మాత్రం ఇటీవ‌ల కూడా తాను రాధా వైపు మాత్ర‌మే ఉన్నాన‌ని తెలిపార‌ట, అయితే గౌతమ్ రెడ్డి ఆశ‌లతో మాత్ర‌మే పార్టీలో ఉన్నారు అంతే అంటున్నారు నాయ‌కులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.