వచ్చే ఎన్నిక‌ల్లో పోటీ పై విజ‌య‌మ్మ క్లారిటీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-29 10:59:02

వచ్చే ఎన్నిక‌ల్లో పోటీ పై విజ‌య‌మ్మ క్లారిటీ

మాజీ సీఎం వైయ‌స్సార్ స‌తీమ‌ణి, వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌ల్లి వైసీపీ గౌర‌వ‌ధ్య‌క్షురాలు వైయ‌స్ విజ‌య‌మ్మ తాజాగా ఇంట‌ర్వ్యూ ఇచ్చి ప‌లు రాష్ట్ర విష‌యాల‌ను, వైసీపీ గురించి, జ‌గ‌న్ గురించి ఆనాటి సంఘ‌ట‌న‌ల గురించి వెల్ల‌డించారు.

వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర పై ఆమె మాట్లాడుతూ, ఇన్ని ల‌క్ష‌ల మంది జ‌గ‌న్ కు త‌మ బాధ‌లు చెప్పుకుంటున్నార‌ని, జ‌గ‌న్ క‌చ్చితంగా అధికారంలోకి వ‌స్తే త‌న తండ్రిపాల‌న‌ను తీసుకువ‌స్తారు అని అన్నారు ఆమె.. అసలు జ‌గ‌న్ పై ఇష్టం వ‌చ్చిన రీతిలో తెలుగుదేశం నాయ‌కులు, మంత్రులు మాట్లాడుతున్నారు అని, ఆ సంఘ‌ట‌న‌లు వింటూ - చూస్తూ ఉంటే త‌న‌కు ఎంతో బాధ వ‌స్తోంద‌ని, ఈ విష‌యంలో క‌న్నీరు పెట్టుకున్న సంద‌ర్బాలు ఉన్నాయి అని అన్నారు విజ‌య‌మ్మ‌.. ఇక వైయ‌స్ జ‌గ‌న్ కాంగ్రెస్ పార్టీ నుంచి బ‌య‌ట‌కు రావాలి అని ఏనాడు అనుకోలేద‌ని, కావాల‌నే తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలు కుమ్మ‌క్కై కేసుల్లో ఇరికించార‌ని అయినా ప్ర‌జా మద్ద‌తు జ‌గ‌న్ కు ఉంద‌ని అన్నారు.

ఇక గ‌తంలో జ‌గ‌న్ పై, అక్రమంగా కేసులు పెట్టి ఇరికించిన స‌మ‌యంలో పార్టీని జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిల మీరు ముందుకు తీసుకువెళ్లారు.. ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తారా అని అడిగిన ప్ర‌శ్న‌కు? స‌మాధానంగా నాకు రాజ‌కీయాలు అంటే ఆస‌క్తి లేద‌ని, బ‌హుశా చేయ‌క‌పోవ‌చ్చు అని క్లారిటీ ఇచ్చారు.. ఒక‌వేళ జ‌గ‌న్ కు ప్ర‌జ‌ల‌కు అవ‌స‌రం అనుకుంటే తాను రాజ‌కీయాల్లోకి వ‌స్తాను అని అన్నారు వైయ‌స్ విజ‌య‌మ్మ‌.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.