చంద్ర‌బాబు అప్పుడు మా ఇంటికి వ‌చ్చారు విజ‌య‌మ్మ‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-29 01:46:34

చంద్ర‌బాబు అప్పుడు మా ఇంటికి వ‌చ్చారు విజ‌య‌మ్మ‌

వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి చంద్ర‌బాబు రాజ‌కీయంగా బ‌ద్ద శ‌త్రువులు... కాని ఇటు ఇరువురు రాజకీయంగా మొద‌టిస్టెప్ వేసింది ఒకే స‌మ‌యంలో అనేది తెలిసిందే.. ఇక చంద్ర‌బాబు వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్న స‌మ‌యంలో ఎంతో స‌యోధ్య‌గా మెలిగేవారని వైయ‌స్ విజ‌య్మ తెలిపారు... తాజాగా వైయ‌స్ విజ‌య‌మ్మ ఇంట‌ర్వ్యూలో వైయ‌స్సార్ విజ‌య‌మ్మ మ‌ధ్య జ‌రిగిన కొన్ని విష‌యాల‌ను బ‌య‌ట‌పెట్టారు.

రాజ‌కీయంగా వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఎంతో క‌ష్ట‌ప‌డ్డారని, పార్టీకి 30 ఏళ్లు సేవ చేశారు కాంగ్రెస్ అంటే ఆయ‌న‌కు ఎంతో అభిమానం ఉండేది అన్నారు విజ‌యమ్మ‌. ఎన్టీఆర్ హావాలో కూడా కాంగ్రెస్ ను వీడి చాలా మంది నాయ‌క‌లు వెళితే, మళ్లీ పార్టీని పీసీసీ ప‌గ్గాలు అందుకుని నడిపారు అందుకే ఆయ‌న‌కు కాంగ్రెస్ లో అంత విలువ ఉండేది అని తెలిపారు వైయ‌స్సార్ స‌తీమ‌ణి విజ‌యమ్మ‌.

ఆయ‌న రాజ‌కీయాల్లో ఉన్న‌ప్పుడు అస‌లు తాను రాజ‌కీయాలు ప‌టించుకునే దానిని కాదు అన్నారు.. అయితే ఎన్టీఆర్ కు జ‌రిగిన అవ‌మానం ఆ నాడు చాలా బాధ వేసింది, వైస్రాయ్ ఉదంతం ఎవ‌రికైనా బాధే... ఆయ‌న పై చెప్పులు విసిరి ఆయ‌నను మ‌రింత కుంగ‌దీశారు అని ఆమె అన్నారు... అయితే వైయ‌స్ చంద్ర‌బాబు కాంగ్రెస్ లో ఉన్న స‌మయంలో కేఈ కృష్ణ‌మూర్తి చంద్ర‌బాబు త‌ర‌చూ మా ఇంటికి వ‌చ్చేవార‌ని బాగానే ప‌ల‌క‌రించేవార‌ని అన్నారు విజ‌యమ్మ‌.. అయితే పార్టీని వీడివెళ్లి పోయే స‌మ‌యంలో వైయ‌స్ చంద్ర‌బాబుకు పార్టీలో ఉండ‌మ‌ని తెలిపార‌ని అయితే తాను పార్టీ వీడుతున్నాను అని వెళ్లిపోయార‌ని అన్నారు... అయితే 14 ఏళ్లు రాజ‌కీయంగా సీఎంగా చంద్ర‌బాబు ఉన్నా ఏపీకి ఎటువంటి ప్ర‌తిఫ‌లం లేద‌ని ఆమె అన్నారు..

చంద్రబాబు 1978లో గెలిచాక చంద్రబాబుకు మంత్రి పదవి ఇప్పించడంలో రాజశేఖరరెడ్డి పాత్ర ఉందని ఆమె వాస్త‌వం చెప్పారు.. అప్పుడు ఎక్కడికి వెళ్లినా వాళ్లు కలిసి వెళ్లేవారని. అంజయ్య గారితో పోట్లాడి మరీ చంద్రబాబుకు మంత్రి పదవి ఇప్పించారు వైయ‌స్ అని ఆమె తెలియ‌చేశారు ఇంట‌ర్వూలో.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.