ప్ర‌ధానికి వైసీపీ లేఖ బాబుకు టెన్ష‌న్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-31 10:39:40

ప్ర‌ధానికి వైసీపీ లేఖ బాబుకు టెన్ష‌న్

ఏపీలో రాజ‌ధాని కుంభకోణంలో రైతుల నుంచి అన్యాయంగా అక్ర‌మంగా వేలాది ఎక‌రాల భూమిని రాజ‌ధాని పేరుతో తీసుకున్నారు అనే అప‌వాదులు ఎదుర్కొంటోంది తెలుగుదేశం పార్టీ.. ఇక ఇటీవ‌ల పెద్ద కుదుపు కూడా చోటు చేసుకున్న అంశం విశాఖ భూ కుంభ‌కోణం.. ఈ వ్య‌వ‌హారంలో తెలుగుదేశం నేత‌లు ఉన్నారు అనేది బీజేపీ నాయ‌కులు కూడా నిర్మొహ‌మాటంగా వెల్ల‌డించిన అంశం.

తాజాగా తెలుగుదేశం భూదోపిడిపై ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర‌మోదీకి లేఖ రాస్తున్న‌ట్లు వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత, బొత్స‌స‌త్య‌నారాయ‌ణ తెలియ‌చేశారు.. అలాగే విజ‌య‌న‌గ‌రం జిల్లాలో భోగాపురం ఎయిర్ పోర్ట్ టెండ‌ర్ ను కావాల‌నే బాబు... కేంద్ర‌మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు ర‌ద్దు చేశారు అని ఆయ‌న మండిప‌డ్డారు. ఈ టెండ‌ర్ ర‌ద్దు వెనుకు ఉన్న వాస్త‌వాల‌ను ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీకి లేఖ‌ద్వారా తెలియ‌చేస్తున్నామ‌ని వైసీపీ తెలియ‌చేసింది.

భోగాపురంలో కేంద్రం అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యాన్ని నిర్మిస్తాము అంటే, బాబు కేబినెట్ ఈ టెండ‌ర్ల‌ను ర‌ద్దు చేసింది అని అన్నారు ఆయ‌న‌. ఇక్క‌డ భూసేక‌ర‌ణ జ‌రగ‌లేదు అని చెప్ప‌డం చాలా విడ్డూరంగా ఉంది అని అంటున్నారు బొత్స‌స‌త్య‌నారాయ‌ణ‌, ఇదే ప్రాంతానికి చెందిన అశోక్ గ‌జ‌ప‌తి రాజు కేంద్ర‌మంత్రిగా ఉన్నా, ఇక్క‌డ ప‌నులు ముందుకు వెళ్ల‌డం లేద‌ని ఆయ‌న విమ‌ర్శించారు.. కేంద్ర‌మంత్రిగా ఉండి ఆయ‌న టీడీపీకి స‌పోర్ట్ గా ఉన్నారు అని అన్నారు బొత్స‌.

భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి 10 వేల ఎకరాలు సేకరిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అప్పుడు ధర్నా చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువ‌చ్చార‌ని...దీంతో స‌ర్కారు దిగొచ్చిందన్నారు. 10 వేల ఎకరాలను 5300 ఎకరాలకు తీసుకొచ్చి దాన్ని మళ్లీ 2560 ఎకరాలకు ఫైనల్‌ చేసిందన్నారు. దాంట్లో 2500ల ఎకరాల భూసేకరణ పూర్తయిందని, మళ్లీ భూసేకరణ జరగలేదని చెప్పడంలో ఆంతర్యం దోపిడీ అని స్పష్టంగా అర్థం అవుతుందన్నారు బొత్స‌... అందుకే ప్ర‌ధానికి దీనిపై పూర్తి ఆధారాల‌తో లేఖ‌రాస్తున్నామ‌ని అన్నారు వైసీపీ నాయ‌కుడు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌.. ఇప్ప‌టికే ఉన్నా స‌మ‌స్య‌ల‌కు తోడు ఈ కొత్త స‌మ‌స్య తెలుగుదేశానికి మ‌రింత హీటు పుట్టిస్తోంది అంటున్నారు తెలుగుత‌మ్ముళ్లు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.