పార్ల‌మెంట్ సాక్షిగా వైసీపీ రాజీనామాపై క్లారిటీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-01 02:39:49

పార్ల‌మెంట్ సాక్షిగా వైసీపీ రాజీనామాపై క్లారిటీ

కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశపెట్టిన  బ‌డ్జెట్ పై  వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తీవ్ర  అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన అనంత‌రం పార్ల‌మెంట్ బ‌య‌ట మీడియాతో మాట్లాడిన వైసీపీ ఎంపీలు రాజీనామా వ్య‌వ‌హారంపై స్పందించారు. 
 
రాజీనామా ప్ర‌క‌ట‌న‌కు ఇప్ప‌టికీ క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని మ‌రోసారి వైసీపీ తెలిపింది. కేంద్ర ప్ర‌భుత్వంలో భాగ‌స్వామ్య‌మైన టీడీపీ ఎంపీలు బ‌డ్జెట్ లో జ‌రిగిన అన్యాయంపై ఏ విధంగా స‌మాధానం చెప్తారో ముందు  చెప్ప‌మ‌నండి  అన్నారు. తాము రాజీనామా చేస్తే విభ‌జ‌న చ‌ట్టంలోని హామీల‌ను, ప్ర‌త్యేక హోదా పై కేంద్రాన్ని పార్ల‌మెంట్ లో ప్ర‌శ్నించేవారు ఉండ‌ర‌ని వారు గుర్తు చేశారు.  
 
ఈ పార్ల‌మెంట్ స‌మావేశాల్లో కేంద్ర ప్ర‌భుత్వంపై ఒత్తిడి తీసుకువ‌స్తామ‌ని, ఒక వేళ ఈ స‌మావేశాల్లో  కేంద్రం విభ‌జ‌న హామీలు, హోదా విష‌యాల‌పై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోని ప‌క్షంలో త‌మ అధినేత వైయ‌స జ‌గ‌న్ తో చ‌ర్చించి రాజీనామా చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఈ రోజే రాజీనామా చేస్తాం... రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా విభ‌జ‌న అంశాలు అమలు అవుతాయా.. చెప్పండి...అంటూ వైసీపీ ఎంపీ వైవీ సుబ్బా రెడ్డి  పేర్కొన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.