అశోక్‌గజపతి రాజు కు వైసీపీ సూటి ప్ర‌శ్న

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-03 02:42:58

అశోక్‌గజపతి రాజు కు వైసీపీ సూటి ప్ర‌శ్న

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో గ‌జ‌ప‌తి రాజు ఫ్యామిలీ  తెలుగుదేశానికి న‌మ్మకంగా ఉంటుంది అనేది తెలిసిందే... అయితే తెలుగుదేశం అధికారంలోకి రావ‌డం, ఎంపీ గా అశోక్ గ‌జ‌ప‌తిరాజు గెల‌వ‌డం ఆయ‌న‌కు కేంద్రంలో మంత్రి ప‌ద‌విరావ‌డం అంతా తెలుగుదేశం బీజేపీ మిత్ర‌ప‌క్షంగా ఉండ‌టంతో జ‌రిగింది... అయితే తాజాగా ఆయ‌న్ని వైసీపీ  సూటిగా ప్ర‌శ్నిస్తోంది.
 
విజయనగరం జిల్లా అవినీతి కార్యక్రమాల్లో కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు పాలుపంచుకున్నారని, ఎయిర్ పోర్ట్‌ టెండర్లను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు రద్దు చేసిందో అశోక్‌ గజపతి రాజు సమాధానం చెప్పి తీరాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయ‌కులు డిమాండ్ చేశారు. తెలుగుదేశానికి కేంద్రానికి వ‌త్తాసు ప‌లుకుతూ ఉండే కేంద్ర‌మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజు... ఈ నాలుగు సంవ‌త్స‌రాల‌లో ఏపీకి ఏం తీసుకువ‌చ్చారో తెల‌పాల‌ని వైసీపీ ప్ర‌శ్నించింది. మంత్రి ఏపీకి ఎటువంటి నిధులు తీసుకురావ‌డంలో స‌క్సెస్ కాలేక‌పోయార‌ని మజ్జి శ్రీనివాసరరావు ధ్వ‌జ‌మెత్తారు.
 
ఈ బ‌డ్జెట్ లో ఏపీకీ ఎటువంటి న్యాయం జ‌ర‌గ‌లేద‌ని, ఎప్ప‌టి నుంచో కోరుతున్న  విజయనగరం గిరిజన యూనివర్సిటీ, భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ కల నెరవేరలేదని మండిపడ్డారు. విభ‌జ‌న హామీల‌ను సాధించుకోవ‌డంలో తెలుగుదేశం ఫెయిల్ అయింద‌ని ఆయ‌న మండిప‌డ్డారు... రాష్ట్ర‌మంత్రులు, కేంద్ర‌మంత్రులు నిధుల కోసం  కేంద్రాన్ని ప్ర‌శ్నించ‌డం లేద‌ని, అందుకే ఏపీకి బీజేపీ మొండి చెయ్యి చూపుతోంద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ నెల 10న ఉత్తరాంధ్రలోని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలతో విజయనగరంలో కార్యక్రమం ఏర్పాటుచేసి ప్రజలకు వాస్తవాలు వివరిస్తామని తెలిపారు వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.