వైకాపాలో కీల‌క నేతపై స‌స్పెన్ష‌న్ వేటు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-26 12:01:25

వైకాపాలో కీల‌క నేతపై స‌స్పెన్ష‌న్ వేటు

గ‌తంలో వంగ‌వీటి రంగాను ఉద్దేశించి గౌత‌మ్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ సీరియ‌స్ గా స్పందించ‌డంతో పాటు ఆయ‌న‌ను స‌స్పెండ్ కూడా చేసింది పార్టీ అధిష్టానం. ఎంత‌టి సీనియ‌ర్ నేత అయినా పార్టీ నియ‌మాల‌ను ఎవ‌రు ఉల్లంఘించిన క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని వైసీపీ నిరూపించుకుంది.

ఇప్పుడు మ‌రో నేతపై కూడా వైకాపా చ‌ర్య‌లు తీసుకుంది. విశాఖ జిల్లా య‌ల‌మంచిలి నియోజ‌క‌వ‌ర్గం కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన ప్ర‌గ‌డ నాగేశ్వ‌రావును బహిష్క‌రించిన‌ట్టు తెలిసింది. ఈ మేర‌కు అన‌కాప‌ల్లి పార్ట‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గం జిల్లా అధ్య‌క్షుడు అమ‌ర్నాధ్ బుధ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసిన‌ట్లు స‌మాచారం.

ప్ర‌గ‌డ నియోజ‌క‌వ‌ర్గంలో క్ర‌మ‌ణ‌శిక్ష‌ణార‌హితంగా వ్య‌వ‌హరిస్తుండ‌టంతో పాటు, పార్టీ వ్య‌తిరేక కార్యాక‌లాపాల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు స్ధానిక నేత‌లు చేసిన ఫిర్యాదుతో..... విచార‌ణ చేప‌ట్టిన పార్టీ అధిష్టానం నాగేశ్వ‌రావును స‌స్పెండ్ చేసిన‌ట్లు తెలిసింది.

నాగేశ్వ‌ర్ రావు వైసీపీ ఆవిర్భావం నుండి కొన‌సాగుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున పోటీ చేసి టీడీపీ అభ్యర్ధి పంచ‌క‌ర్ల ర‌మేష్ బాబు చేతిలో ఓడిపోయారు. అనంత‌రం ఆయ‌న్ను పార్టీ స‌మ‌న్వ‌య‌క‌ర్త ప‌ద‌వి నుండి తొల‌గించి బొడ్డేడ శివ‌ప్ర‌సాద్ కు అప్ప‌గించారు, ఇప్పుడు ఏకంగా పార్టీ నుండే స‌స్పెండ్ చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.