సోమిరెడ్డి ప్ర‌యాణిస్తున్న కారు టైర్లు పేలి డివైడ‌ర్ ను ఢీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

somi reddy
Updated:  2018-10-15 10:36:55

సోమిరెడ్డి ప్ర‌యాణిస్తున్న కారు టైర్లు పేలి డివైడ‌ర్ ను ఢీ

అధికార తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌సాయ శాఖ‌ మంత్రి సోమిరెడ్డి త‌న కారులో శ్రీకాకుళం జిల్లాకు ప్ర‌యాణిస్తున్న త‌రుణంలో ఘోర ప్ర‌మాదం నుంచి బ‌య‌ట ప‌డ్డారు. తిత్లీ తుఫానుకు విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం ఈ రెండు జిల్లాల‌ ప్ర‌జ‌లు న‌ష్ట‌పోయిన సంగ‌తి తెలిసిందే. 
 
అయితే తాజాగా వారిన ప‌రామ‌ర్శించేందుకు మంత్రి బ‌య‌ల్దేరిన‌ కొద్ది గంట‌ల్లోనే ఆయ‌న ఆయ‌న‌తోపాటు ప్ర‌యాణిస్తున్న కారు జాతీయ ర‌హాదారిలో టైర్లు పేల‌డంతో వాహ‌నం అదుపు త‌ప్పి డివైడ‌ర్ వైపు దూసుకెళ్లింది. అయితే కారు డైవ‌ర్ చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించి త‌న‌కున్న అనుభ‌వంతో వాహ‌నాన్ని అదుపుచేశాడు. దీంతో ప్ర‌మాదం త‌ప్పింది. 
 
కారులో ఉన్న సోమిరెడ్డికి ఎలాంటి గాయాలు అవ్వ‌లేద‌ట‌. ఆ త‌ర్వ‌త ఆయ‌న వేరే కారులో శ్రీకాకుళం జిల్లాకు ప్రయాణం చేసి తిత్లీ బాధిత ప్ర‌జ‌ల‌ను ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ప్ర‌భుత్వం ప్ర‌తి ఒక్క‌రిని ఆదుకుంటుంద‌ని సోమిరెడ్డి హామీ ఇచ్చారు.

షేర్ :

Comments

0 Comment