వైసీపీలోకి టీడీపీ మంత్రి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-11 11:35:07

వైసీపీలోకి టీడీపీ మంత్రి

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో మ‌రోసారి అధికార ప‌గ్గాలు సొంతం చేసుకోవాల‌నే ఉద్దేశ్యంతో ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశంపార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు మినీ మ‌హానాడు స‌భ‌ల‌ను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే.ఇక మ‌రోవైపు  2019 లో అధికార‌మే లక్ష్యంగా చేసుకుని ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 2017 న‌వంబ‌ర్ 6 న త‌న సొంత జిల్లా వైయ‌స్సార్ క‌డ‌ప జిల్లా పులివెందుల నియోజ‌కవ‌ర్గంలోని ఇడుపుల‌పాయ నుంచి ప్ర‌తిష్టాత్మ‌కంగా పాద‌య‌త్ర‌ను మొద‌లు పెట్టారు. 
 
అయితే వీరిద్ద‌లో ఎవ‌రికి అత్య‌ధిక సంఖ్య‌లో ప్ర‌జలు మ‌ద్ద‌తు తెలుపుతున్నారంటే ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ కే ఎక్కువ సంఖ్య‌లో మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. ఈ విష‌యం ఏ ప్రతిప‌క్ష‌ వైసీపీ నాయ‌కులు కానీ, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు చెబితే అది ఫేక్ అవుతోంది. కానీ సాక్షాత్తు అధికారంలో ఉండి మంత్రి ప‌ద‌విలో ఉన్న టీడీపీ నాయ‌కులే చెబుతున్నారు.ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్ కు అడుగ‌డుగునా ప్ర‌జలు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నార‌ని చెబుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీనే అధికారంలోకి వ‌స్తుంద‌ని అంటున్నారు.
 
దీంతో కొంత‌మంది టీడీపీ మంత్రులు త‌మ ఫ్యూచ‌ర్ రాజ‌కీయాల‌ను దృష్టిలో ఉంచుకుని జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకునేందుకు రెడి అవుతున్నారు.ఇక‌ ముఖ్యంగా చెప్పాలంటే జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తున్న పశ్చిమ గోదావరి జిల్లాలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీకి బీట‌లు వాలే అవ‌కాశం ఎక్కువ‌గా కనిపిస్తోంది. ఎందుకుంటే జ‌గ‌న్  చేస్తున్న పాదయ‌త్ర‌కు టీడీపీ కంచుకోట గుంటూరు, కృష్ణా జిల్లాల‌ను త‌ల‌ద‌న్నే విధంగా ప‌శ్చిగోదావ‌రి జిల్లాలో జ‌గ‌న్ కు అధిక సంఖ్యలో ప్ర‌జ‌లు మ‌ద్ద‌తు తెలుపుతున్నారు.
 
2014 ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి రాకుండాపోవ‌డానికి ముఖ్య కార‌ణం ఈ జిల్లానే అని చెప్పాలి. ఎందుకంటే ఈ జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కానీ గ‌డిచిన ఎన్నిక‌ల్లో వైసీపీకి ఒక్క సీటుకుడా ద‌క్క‌లేదు. అన్ని అసెంబ్లీ స్థానాల‌న్ని టీడీపీనే ద‌క్కించుకుంది.దీంతో వైసీపీ అధికారంలోకి రాలేకపోయింది. 
 
ఇక తాజాగా జ‌గ‌న్ త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌కు ప‌శ్చిమ గోదావరి జిల్లా ప్ర‌జ‌లు అడుగ‌డుగునా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతుండ‌టంతో ఖ‌చ్చితంగా 2014లో వైసీపీకి ఎన్ని సీట్లు వ‌చ్చాయో 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీకి అదే సీన్ రిపీట్ అవుతుంద‌ని భావించి ఆచంట నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ ఎమ్మెల్యే మంత్రి పితాని స‌త్య‌నారాయ‌ణ త్వ‌ర‌లో టీడీపీకి గుడై చెప్పి వైసీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని విస్వ‌స‌నీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే ప్ర‌స్తుతం ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి బాగానే ఉన్న‌ప్ప‌టికీ భ‌విష్య‌త్తుపై బెంగ మొద‌లైంద‌ట‌. 
 
ఎందుకంటే 2014 ఎన్నిక‌ల ప్ర‌చారంలో చంద్ర‌బాబు నాయుడు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క‌టీ సంపూర్ణంగా అమ‌లు చేయ‌క‌పోటంతో ప్ర‌జ‌ల్లో టీడీపీ పై వ్య‌తిరేక‌త ఏర్ప‌డింది. చంద్ర‌బాబు హామీల్లో ప్ర‌ధానంగా కాపుల‌ను బీసీల్లో చేరుస్తాన‌ని చెప్పి ఇంత‌వ‌ర‌కూ వారిని బీల్లో చేర్చ‌లేదు. ఇక రెండ‌వ‌ది నిరుద్యోగుల‌కు ఉద్యోగం ఇస్తాన‌ని లేక‌పోతే నిరుద్యోగ భృతి ఇస్తాన‌న్న‌ హామీ ఇచ్చారు కానీ అది కూడా చంద్ర‌బాబు నీరు కార్చారు. 
 
ఇక రైతు రుణ‌మాఫీ సంగ‌తి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అలాగే డ్వాక్రా సంఘాల రుణాలు కూడా మాఫీ కాలేదు. అయితే వీట‌న్నింటిని ప్ర‌జ‌లు దృష్టిలో పెట్టెకుని వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీకి త‌గిన బుద్ది చెబుతార‌నే ఉద్దేశ్యంతో పితాని పార్టీ మారేందుకు సిద్ద‌మ‌య్యార‌ని తెలుస్తోంది. ఇక ఇదే విష‌యం గురించి పితాని త‌న అనుచ‌రుల‌తో చ‌ర్చించార‌ట‌. అయితే వారు కూడా సానుకూలంగా స్పందించార‌ట‌. దీంతో పార్టీనేత‌ల సూచ‌న‌ల మేర‌కు జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకునేందుకు రెడి అయ్యార‌ట‌. ఇక ఈ విష‌యంపై జ‌గ‌న్ కూడా సానుకూలంగా స్పందిస్తున్నార‌ట‌. ఒక వేళ‌ పితాని వైసీపీలో చేరితే 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో న‌ర‌సాపురం నుంచి ఎంపీగా పోటీ చేస్తార‌ని కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది.

షేర్ :

Comments

1 Comment

  1. Pls do not troll&write the fake news in janahitam channel. pls

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.