తిత్లీ తుఫాన్ బాధితుల ద‌గ్గ‌ర ఓట్లు అడిగి సంచ‌ల‌నంగా మారిన టీడీపీ మంత్రి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp
Updated:  2018-10-17 01:36:15

తిత్లీ తుఫాన్ బాధితుల ద‌గ్గ‌ర ఓట్లు అడిగి సంచ‌ల‌నంగా మారిన టీడీపీ మంత్రి

తీత్లీ తుఫాను కార‌ణంగా విజ‌య‌న‌గ‌రం జిల్లా శ్రీకాకుళం జిల్లాలు త‌డిసి ముద్దయిన సంగ‌తి తెలిసిందే. అయితే  ఏపీ స‌ర్కార్ మాత్రం ఇంత‌వ‌ర‌కు వారికి ఎలాంటి నిత్య‌వ‌సర వ‌స్తువులు స‌మ‌కూర్చ‌లేదు. దీంతో ప‌లు ప్రాంతాల ప్ర‌జ‌లు ప్ర‌భుత్వ ఆఫీసులు ముందు ధ‌ర్నాలు చేస్తున్నారు. అయితే ఇదే క్ర‌మంలో ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు బాధితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్లారు. 
 
తూఫాన్ సంభ‌వించి సుమారు ఐదు రోజుల త‌ర్వాత ఆయ‌న జిల్లా ప‌ర్య‌ట‌న చేయ‌గా ఈ పర్య‌ట‌న‌లో కొండ ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను పరామ‌ర్శించ‌కుండా త‌మకు ఓట్లు వెయ్యాలి అని గ్రామ‌స్తులను ఆశ్చ‌ర్యానికి గురిచేశారు. 2014లో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మీరంద‌రూ త‌న‌కు ఓట్లు వేయ‌కున్నా టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మీకు రోడ్లు వేశా, ఈసారి త‌ప్ప‌కుండా నాకే ఓటు వెయ్యాల‌ని వ్యాఖ్యానించారు.
 
అంతేకాదు ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  నాయ‌కులు, అలాగే కార్య‌క‌ర్త‌లు ఓట్ల‌కోసం వ‌స్తే వారి మెడ‌ల‌ను వంచి ఈడ్చుకు వెళ్లాల‌ని చెప్పారు. ఇక ఈ వ్యాఖ్య‌లు విన్న గ్రామ‌స్తులు మంత్రి హోదాలో ఉన్న అచ్చెన్నాయుడు తుఫాన్ బాదితుల‌కు అండగా ఉండి వారిని ఆదుకునేది పోయి గ్రామాల్లో గొడ‌వ‌లు సృష్టించేలా మాట్లాడ‌టం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment