వైసీపీలోకి మ‌రో సిని న‌టుడు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-06 17:00:29

వైసీపీలోకి మ‌రో సిని న‌టుడు

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరిక‌లు అధికం అవుతున్నాయి. గతంలో ఎన్న‌డు లేని విధంగా చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన న‌టీ న‌టులు వైసీపీ వైపు చూస్తున్నారు. అయితే ఇప్ప‌టికే 30 ఇయ‌ర్స్ ఇంస్ట్రీ పృథ్వీ, అలాగే ద‌ర్శ‌కుడు పోసాని కృష్ణ‌మురళి వైసీపీకి మ‌ద్ద‌తు తెలిపిన సంగ‌తి తెలిసిందే. 
 
ఇక ఇదే క్ర‌మంలో మ‌రో న‌టుడు, జ‌గన్ ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాల‌కు ఆక‌ర్షితులై ఈ రోజు పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మక్షంలో కృష్ణుడు వైసీపీ తీర్థం తీసుకున్నారు. వైసీపీ తీర్థం తీసుకున్న త‌ర్వాత ఆయ‌న మాట్లాడుతూ, 2019లో వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత అమ‌లు చేయ‌బోయే న‌వ‌రత్నాల‌కు తాను ఆక‌ర్షితుడై వైసీపీలో చేరానని స్ప‌ష్టం చేశారు. అంతేకాదు జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యేందుకు త‌న‌వంతు కృషి చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు.
 
ప్ర‌స్తుతం సంక‌ల్ప‌యాత్ర తెలుగుదేశంపార్టీ నాయ‌కులు కంచుకోట తూర్పుగోదావ‌రి జిల్లా పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలోని క‌త్తిపుడి శివారులో దిగ్విజ‌యంగా కొన‌సాగుతోంది. ఈ పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ 2014 నుంచి 2018 వ‌ర‌కు అధికార తెలుగు దేశంపార్టీ నాయ‌కులు చేస్తున్న అవినీతి అరాచ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ పాద‌యాత్ర‌లో ముందుకు సాగుతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.