బాబుకు పోటీగా అభ్య‌ర్థిని ఫిక్స్ చేసిన జ‌గ‌న్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-26 16:50:16

బాబుకు పోటీగా అభ్య‌ర్థిని ఫిక్స్ చేసిన జ‌గ‌న్

ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌కు అడుగ‌డుగునా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే.ఈ సంక‌ల్పయాత్ర‌లో జ‌గ‌న్ ఎప్పుడు అయితే రాయ‌లసీమ నాలుగు జిల్లాల‌ను పూర్తి చేసుకుని కోస్తాంధ్ర‌లోకి అడుగుపెట్టారో అప్ప‌టి నుంచి విప‌రీతంగా టీడీపీ నాయ‌కుల వైసీపీ లోకి వల‌స‌లు ఊపందుకుంటున్నాయి. 
 
ఇక ఇప్ప‌టికే టీడీపీ నుంచి అనేక మంది సీనియ‌ర్ టీడీపీ నాయ‌కులు పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌లుసుకుని ఆయ‌న స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకున్న‌సంగ‌తి తెలిసిందే.ఇక తాజాగా తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌ముఖ న‌టీ,న‌టులు కూడా త్వర‌లో వైసీపీలో చేరేందుకు స‌న్న‌హాలు చేస్తున్నార‌ని విశ్లేష‌కులు తెలుపుతున్నారు. అయితే ఇప్ప‌టికే హ‌స్య న‌టుడు, ద‌ర్శ‌కుడు పోసాని కృష్ణ ముర‌ళీ వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి మ‌ద్ద‌తు తెలిపిన సంగ‌తి తెలిసిందే. తాను వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌చ్చితంగా వైసీపీకి ఓటు వేస్తాన‌ని మీడియా స‌మ‌క్షంలో బ‌హిరంగంగానే చెప్పారు. 
 
ఇక ఇప్ప‌డు క‌లెక్ష‌న్ కింగ్, డైలాగ్ కింగ్ మోహ‌న్ బాబు వైసీపీలో చేర‌బోతున్నారు. గ‌తంలో కూడా ఆయ‌న వైసీపీలో చేరేందుకు సిద్దమ‌య్యార‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఈ వార్త‌ త్వ‌ర‌లో నిజం కాబోతుంద‌ని తెలుస్తోంది. అలాగే 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున బ‌రిలో దిగ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.సీఎం సొంత జిల్లాలో ఆయనకు చెక్ పెట్టే ప్రాభల్యం ఉన్న వ్యక్తి మోహన్ బాబు అవడంతో జగన్ టికెట్ ఇవ్వడానికి సుముఖంగా ఉన్నార‌ని తెలుస్తోంది.
 
మోహ‌న్ బాబు టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు మాజీ ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క‌రామారావుకు వీరాభిమాని, ఈ అభిమానంతో  క‌లెక్ష‌న్ కింగ్ 1982 లో టీడీపీ తీర్థం తీసుకుని పార్టీ త‌ర‌పున ప్ర‌చారం చేశారు. ఆ త‌ర్వాత 1995లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ త‌ర‌పున రాజ్య‌స‌భ‌కు ఎంపిక‌య్యారు. అయితే కొన్ని అనివార్య కార్య‌క్ర‌మాల‌వ‌ల్ల టీడీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి తిరిగి మ‌ళ్లీ సినిమాల మీద దృష్టి సారించారు. 
 
ఇక అప్పుడ‌ప్పుడు మీడియా ముందు రాజ‌కీయనాకుల‌పై స్పందించేవారు. ప్ర‌స్తుత రాజ‌కీయ‌నాయ‌కులు నూటికి 95 శాతం చెడిపోయి వ్య‌హ‌రిస్తున్నార‌ని తాను  ఈ చెడిపోయిన రాజ‌కీయాల్లోకి వెళ్ల‌న‌ని చెప్పారు. అయితే తెలుగు రాష్ట్రాల విభ‌జన త‌ర్వాత వైఎస్ జ‌గ‌న్ కాంగ్రెస్ తో తెగ తెంపులు తెంచుకుని సొంతంగా పార్టీ స్థాపించారు. అప్ప‌టి నుంచి వైఎస్ కుటుంబానికి మోహ‌న్ బాబుకు స‌న్నిహిత సంబందం ఏర్ప‌డింది. ఈ స‌న్నిహిత సంబందం ద్వారా క‌లెక్ష‌న్ కింగ్ మ‌ళ్లీ రాజ‌కీయాల‌కు రీ ఎంట్రీ ఇవ్వ‌నున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.