జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో పృథ్వీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-31 14:16:26

జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో పృథ్వీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

2019లో వైసీపీ అధికారంలోకి వ‌స్తే ప్ర‌తీ ఒక్క‌రి ముఖంలో చిరున‌వ్వును చూస్తా, నాన్న గారు ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు రాష్ట్రాన్ని ఏ విధంగా ప‌రిపాల‌న చేశారో తాను కూడా అదే ప‌రిపాల‌న చేస్తాను. నాన్న‌గారు ప్ర‌జ‌ల కోసం ఒక్క అడుగు ముందుకు వేస్తే ఆయ‌న కుమారుడు అయిన నేను ప్ర‌జ‌ల కోసం రెండు అడుగులు ముందుకు వేస్తాన‌ని చెప్పి కొండంత భ‌రోసా ఇస్తూ ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో ముందుకు సాగుతున్నారు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. 
 
2017 న‌వంబ‌ర్ 6వ తేదిన ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర రాయ‌ల‌సీమ‌లోని నాలుగు జిల్లాల‌ను  అలాగే కోస్తాలోని ఐదు జిల్లాల‌ను పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం టీడీపీ కంచుకోట తూర్పు గోదావ‌రి జిల్లా పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో నిర్విరామంగా కొన‌సాగుతుంది. ఈ పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు చేస్తున్న అవినీతి ప‌రిపాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు. 
 
పిఠాపురంలో కొన‌సాగుతున్న పాద‌యాత్ర‌లో ప్ర‌ముఖ సినీ న‌టుడు 30 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ పృథ్వీ మ‌రోసారి పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌లిసి సుమారు గంట‌సేపు జ‌న‌నేత‌తో పాద‌యాత్ర చేశారు. ఆ త‌ర్వాత ఆయన‌ మీడియాతో మాట్లాడుతూ, త‌న ప్రాణం ఉన్నంత‌ వ‌ర‌కు వైఎస్ కుంటంబానికి అండ‌గా నిలుస్తాన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. 2019లో జ‌గ‌న్ త‌న‌ను ప్ర‌జలు ముఖ్య‌మంత్రిని చేస్తే రాజ‌న్న ప‌రిపాల‌న తీసుకువ‌స్తాన‌ని చెప్ప‌లేద‌ని... ప్ర‌జ‌లంద‌రి చ‌ల్ల‌ని దీవెన‌ల‌తో మ‌నంద‌రి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌స్తే రాజ‌న్న ప‌రిపాల‌న తీసుకువ‌స్తాన‌ని చెబుతున్నారని పృథ్వీ స్ప‌ష్టం చేశారు. 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.